Monday, December 23, 2024

పది రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తి: మంత్రి గంగుల

- Advertisement -
- Advertisement -

Complete grain collection in ten days: Minister Gangula

గన్నీలు, గోడౌన్లు, ట్రాన్స్‌పోర్ట్ ఇబ్బందులు లేవు
7.7 లక్షల రైతుల నుంచి 8 వేల కోట్ల 41.33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
మరో 11.43 లక్షల మెట్రిక్ టన్నులు రావచ్చని అంచనా, చివరి గింజ వరకూ కొంటాం
2257 కొనుగోలు కేంద్రాల్లో ముగిసిన ప్రక్రియ
యాసంగి ధాన్యం కొనుగోళ్లపై శ్వేతపత్రం విడుదల చేసిన మంత్రి గంగుల కమలాకర్

హైదరాబాద్ : పది రోజుల్లో పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోళ్ల సేకరణ పూర్తవుతుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గురువారం ఆయన ఓ ప్రకటనలో రాష్ట్ర ప్రజలకు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు చెపుతూ ధాన్యం కొనుగోళ్లపై శ్వేత పత్రం విడుదల చేశారు. అలుపెరగని పోరాటం చేసి రాష్ట్రం సాధించిన ముఖ్యమంత్రి కెసిఆర్ సారథ్యంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు, కేంద్రం మోకాలడ్డుతున్నా దాదాపు 3 వేల కోట్ల నష్టాన్ని భరించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరిస్తున్నామన్నారు. కమిషనర్ కార్యాలయంలో వార్ రూం ఏర్పాటు చేసి మిల్లర్లు, ట్రాన్స్‌ఫోర్ట్, కొనుగోలు కేంద్రాలు, హమాలీలను అనుసంధానం చేస్తూ కొనుగోళ్లు జరుగుతున్నాయన్నారు. మరో పది రోజుల్లోపు పూర్తి స్థాయిలో సేకరణ పూర్తవుతుందన్నారు.

కొనుగోళ్లు ప్రారంభించినప్పుడు కొత్త గన్నీలు యాభై ఏడు లక్షలు, పాతవి కోటి ఐదు లక్షల బాలెన్స్‌తో సేకరణ మొదలుపెట్టామన్నారు. అందుబాటులో ఉన్న అన్ని వనరుల ద్వారా గన్నీలు సేకరించి ఎక్కడా చిన్న సమస్య తలెత్తకుండా సఫలీకృతమయ్యామన్నరు, 13 కోట్ల 69 లక్షల గన్నీలు సేకరించి ఇంకా 14లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు సరిపోగా.. 3 కోట్ల 37 లక్షల గన్నీలు అదనంగా అందుబాటులో ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. అకాల వర్షాలకు తడిసిన 15వేల మెట్రిక్ టన్నులను సైతం సేకరించామన్నారు. ఎక్కడా రవాణా ఇబ్బందులు తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ చేశామన్నారు. గురువారం వరకు 6579 కొనుగోలు కేంద్రాల ద్వారా 7 లక్షల 7వేల మంది రైతుల వద్ద నుంచి 8 వేల కోట్ల విలువ గల 41.33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు. ఇందులో దాదాపు 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు సైతం తరలించామన్నారు, కొనుగోళ్లు ముగిసిన 2257 కొనుగోలు కేంద్రాలను మూసివేస్తామన్నారు, ఎక్కడా స్టోరేజీ సమస్య ఎదురుకాకుండా చర్యలు తీసుకున్నామన్న మంత్రి తెలిపారు.

రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, నారాయణపేట్, జగిత్యాల, మెదక్ వంటి అధిక వరిపండిన ప్రాంతాల నుంచి మిల్లింగ్ కోసం అధిక కెపాసిటీ గల పెద్దపల్లి, కరీంనగర్, వనపర్తి, వరంగల్, జోగులాంబ జిల్లాలకు 2.64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తరలించామన్నారు. గోడౌన్లు సైతం అందుబాటులో ఉన్నాయని, కొరత ఉన్న మహబూబ్ నగర్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో సైతం స్టోరేజీ ఏర్పాటు చేశామన్నారు. జిల్లాల అంచనాల ప్రకారం పిపిసిల్లో 7.11 లక్షల మెట్రిక్ టన్నులు, కోతలు పూర్తికావలసిన 4.32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని, కొనుగోలు కేంద్రాలకు వచ్చిన చివరి గింజవరకూ కొనాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా సేకరిస్తామన్నారు, ప్రస్తుతం రోజుకు లక్ష మెట్రిక్ టన్నులకు పైగా సేకరిస్తున్నామని ఈ మేరకు మరో పది రోజుల్లో పూర్తిస్థాయిలో ధాన్యం సేకరణ ముగుస్తుందన్నారు. ముఖ్యమంత్రి విజ్ణప్తితో యాసంగిలో గణనీయంగా వరిసాగు తగ్గిందని, ఇతర ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు వెళ్లారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News