Saturday, November 23, 2024

ఎయిర్ విస్తారాకు రూ.10 లక్షల జరిమానా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సరైన శిక్షణ లేని పైలెట్లతో విమానం నడిపించి, ప్రయాణికులను ప్రమాద భయం కలిగించిన కేసులో భద్రతా నియమావళిని ఉల్లంఘించిన ఎయిర్ విస్తారా సంస్థకు భారత వైమానిక రెగ్యులేటరీ సంస్త(డీజీసీఎ) రూ.10 లక్షల జరిమానా విధించింది. మధ్యప్రదేశ్ ఇండోర్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులతో ఉన్న విమానాన్ని అనుభవం లేని ఫస్ట్ ఆఫీసర్ పైలెట్ నడిపారు. సిములేటర్ శిక్షణ పూర్తి కాని పైలెట్లతో విమానాన్ని ల్యాండ్ చేయడం నేరమే అవుతుందని అధికారులు తెలిపారు. ఫస్ట్ ఆఫీసర్ పైలెట్‌లు విమానాన్ని ల్యాండింగ్ చేయడంలో మొదట సిములేటర్‌లో శిక్షణ పొందవలసి ఉంటుంది.కేప్టెన్లు కూడా లాండింగ్‌కు ఫస్ట్ ఆఫీసర్‌ను అనుమతించేటప్పుడు సిములేటర్‌లో శిక్షణ పొందవలసి ఉంటుంది. అయితే ఇండోర్ విమానానికి సంబంధించి కెప్టెన్ కానీ, ఫస్ట్‌ఆఫీసర్ కానీ సిములేటర్‌లో శిక్షణ పొందలేదని అధికారులు చెప్పారు.

DGCA imposes Fine Rs.10 lakh to Air Vistara

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News