హైదరాబాద్: జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం ఉదయం ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి, కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్‌లు పోలీసు గౌరవ వందనాన్నిస్వీకరించారు. అనంతరం మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ ఎన్నేనో త్యాగాలతో సాధించుకున్న స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని, ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని నగరవాసులందరికీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సం శుభాకాంక్షలను తెలియజేస్తున్ననన్నారు. తెలంగాణ ఉద్యమ నాయకులు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో సాగించిన అవిశ్రాంత ఉద్యమ ఫలితంగా తెలంగాణ 29వ రాష్ట్రంగా అవతరించిందన్నారు.
ఉద్యమంలో ఆత్మ బలిదానాలు చేసుకున్న అమరవీరులకు శ్రద్దాంజలి ఘటిస్తున్నామని తెలిపారు. స్వరాష్ట్రం సాధన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గ దర్శకత్వంలో జిహెచ్‌ఎంసి ఎన్నడూ లేని విధంగా అభివృద్దిపథంలో ముందుకు సాగుతుందని చెప్పారు. పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ దిశా నిర్దేశనంలో హైదరాబాద్ నగరంలో విశ్వనగరంగా పురోగాభివృద్ది చెందుతోందని మేయర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి, కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, అడిషనల్ కమిషనర్లు శృతి ఓజా, బి.సంతోష్, వి.కృష్ణ, జయరాజ్ కెనడీ, సరోజ, విజయలక్ష్మి, ఈవిఎండి విశ్వజిత్, ఇఎన్‌సి జియాఉద్దీన్, హౌసింగ్ ఓఎస్‌డి సురేష్ కుమార్, సిసిపి దేవేందర్‌రెడ్డి, ప్రాజెక్టు ఎఎస్ సి.వెంకటరమణ, సిపిఆర్‌ఓ మహమ్మదఃవ ముర్తుజా, పైనాన్స్ అడ్వైజర్ విజయ్ కుమార్, చీఫ్ ఎగ్జామినర్ వెంకటేశ్వరరెడ్డి, స్పోర్ట్ డైరెక్టర్ బాషా, సెక్రటరీ లక్ష్మి, జాయింట్ కమిషనర్లు కులకర్ణి, సంధ్య, తిప్పర్తి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.