న్యూఢిల్లీ : ప్రఖ్యాత సంతూర్ సంగీత వాద్య విద్వాంసుడు, పద్శశ్రీ భజన్ సొపోరీ ( 73) గురువారం హర్యానా లోని గురుగ్రామ్ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా పేగు క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు సొరాబ్, అభయ్ ఉన్నారు. వారు కూడా సంతూర్ వాద్యంలో నిష్ణాతులే. గత ఏడాది జూన్‌లో ఆయనకు పేగు క్యాన్సర్ సోకినట్టు గుర్తించడమైందని, మూడు వారాల క్రితం ఇమ్యునోథెరపీ కోసం గురుగ్రామ్ ఫోర్టిస్ ఆస్పత్రిలో చేర్చడమైందని , అయినా ఆయన ఆరోగ్యం మెరుగుపడక క్షీణించిందని ఆయన కుమారుడు అభయ్ చెప్పారు. ఆయన అంత్యక్రియలు శుక్రవారం లోఢి రోడ్డులో జరుగుతాయి. సొపోరీ తన జీవిత కాలంలో అనేక అవార్డులు అందుకున్నారు. 2004 లో పద్శశ్రీ, 1992 లో సంగీత్ నాటక్ అకాడమీ అవార్డు, జమ్ము కశ్మీర్ స్టేట్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నారు. వాషింగ్టన్ యూనివర్శిటీలో పాశ్చాత్య శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించారు. తన తండ్రి, తాతల నుంచి సంప్రదాయ హిందుస్థానీ సంగీతాన్ని నేర్చుకున్నారు.
ప్రఖ్యాత సంతూర్ సంగీత విద్వాంసుడు భజన్ సొపోరీ కన్నుమూత
- Advertisement -
- Advertisement -
- Advertisement -