- Advertisement -
గాంధీనగర్: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, రెండు సార్లు ఎంపిగా గెలిచి కేంద్ర మంత్రి పదవి చేపట్టిన నాయకుడు తన ప్రియురాలుతో సరసలాడుతుండగా రెడ్ హ్యాండడ్‌గా అతడి సతీమణి పట్టుకున్న సంఘటన గుజరాత్ రాష్ట్రంలో జరిగింది. మాజీ కేంద్ర మంత్రి భరత్ సింగ్ సోలంకి కొన్ని రోజుల క్రితం భార్యతో గొడవ పడి వేరుగా ఉంటున్నాడు. అతడు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. గుజరాత్‌లోని ఆనంద్ ప్రాంతంలో తన బంగ్లాలో ఓ మహిళతో అతడు సన్నిహితంగా ఉన్న సమయంలో భార్య రేష్మా పటేల్ పట్టుకుంది. సదరు మహిళపై రేష్మా తీవ్రంగా దాడి చేసింది. మహిళను కొడుతుండగా భరత్ సింగ్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
- Advertisement -