- Advertisement -
తిరుపతి: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు జన్మదినం సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. హరీష్ రావుకు టిటిడి అధికారులు ఘనస్వాగతం పలికారు. హరీష్ రావుకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తలనీలాలు సమర్పించుకున్నారు. నేటితో తను 50వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా స్వామి వారి ఆశీస్సులు పొందడానికి తిరుమల వచ్చినట్లు తెలిపారు. తన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు, టిఆర్ఎస్ కార్యకర్తలు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని హరీష్ రావు పిలుపునిచ్చారు.
- Advertisement -