- Advertisement -
హైదరాబాద్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని అంజయ్య నగర్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. తాను ఉంటున్న ఇంట్లోనే పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడిని జాహీర్ (22) గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. జాహీర్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -