జూన్ 13న హాజరుకు ఆదేశం
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జూన్ 13న తమ ఎదుట హాజరుకావాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) శుక్రవారం కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీకి తాజాగా సమన్లు జారీచేసింది. తొలుత జూన్ 2న హాజరుకావాలని ఇడి రాహుల్‌కు సమన్లు జారీచేయగా తాను దేశంలో లేని కారణంగా మరో తేదీని నిర్ణయించాలని రాహుల్ కోరడంతో ఇడి తాజా సమన్లు జారీచేసింది. సెంట్రల్ ఢిల్లీలోని ఇడి ప్రధాన కార్యాలయంలో ఈ నెల 13న రాహుల్ హాజరుకావలసి ఉంటుంది. కాగా..ఇదే కేసులో జూన్ 8న హాజరుకావాలంటూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కూడా ఇడి ఇదివరకు సమన్లు జారీచేసింది. అయితే..గురువారం సోనియా గాంధీకి కొవిడ్ సోకినట్లు నిర్ధారణ అయినప్పటికీ తాను మాత్రం నిర్ణీత తేదీ జూన్ 8న ఇడి ఎదుట హాజరవుతానని సోనియా కృతనిశ్చయంతో ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.