Monday, December 23, 2024

పూరీ ఆలయంలో అక్రమ తవ్వకాలు, నిర్మాణాలపై పిల్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

- Advertisement -
- Advertisement -

SC dismisses plea against construction at Jagannath temple

న్యూఢిల్లీ: ప్రముఖ పుణ్యక్షేత్రమైన పూరీలోని జగన్నాథ ఆలయంలో ఒడిశా ప్రభుత్వం చట్టవ్యతిరేకంగా తవ్వకాలు, నిర్మాణాలు చేపడుతోందని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)ను తోసిపుచ్చిన న్యాయమూర్తులు బిఆర్ గవాయ్, హిమా కోహ్లీతో కూడిన వెకేషన్ బెంచ్ విస్తృతమైన ప్రజాప్రయోజనాల దృష్టానే నిర్మాణ కార్యకలాపాలు చేపడుతున్నారనిపేర్కొంది. ప్రజాప్రయోజనాలకు కాకుండా వేరే విషయాలపై పిల్స్ దాఖలు చేయడం ప్రజాప్రయోజనాలకు విఘాతం కలిగిస్తాయని ఈ సందర్భంగా బెంచ్ వ్యాఖ్యానించింది. ఇటీవలి కాలంలో పిల్స్ పుట్టగొడుగుల తరహాలో పెరిగిపోతున్నాయని కూడా బెంచ్ వ్యాఖ్యానించింది. దురుద్దేశపూరిత పిల్స్ దాఖలు చేయడం చట్టాన్ని దుర్వినియోగం చేయడమేనని కూడా బెంచ్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించింది. అర్ధేందు కుమార్ దాస్, తదితరులు ఈ పిల్ దాఖలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News