Monday, December 23, 2024

బీహార్ లో విద్యుత్ కు కటకటా!

- Advertisement -
- Advertisement -
Operation in Bihar
ఫోన్ లైట్ తోనే ఆపరేషన్…

పాట్నా: బీహార్ లో విద్యుత్ కటకటా ఎంతగా ఉందో చెప్ప సాధ్యం కాదు. ఎందుకంటే చివరికి అక్కడ ప్రాణాలు కాపాడే ఆపరేషన్ చేయడానికి సైతం డాక్టర్లు మొబైల్ ఫోన్ లైట్ ఉపయోగించుకుంటున్నారు. సాసారామ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. అక్కడ ఓ గ్రూప్ తగాదా ఘర్షణలో నలుగురు గాయపడ్డంతో వారిని ట్రామా సెంటర్ కు చికిత్స కోసం తీసుకొచ్చారు. గోపాల్ గంజ్ లోని  సదర్ హాస్పిటల్ కు చెందిన డాక్టర్ బ్రిజేశ్ కుమార్ అక్కడ తరచూ విద్యుత్  కు అంతరాయం ఏర్పడుతుంటుందని తెలిపారు. మొబైల్ ఫోన్ ఫ్లాష్ లైట్తో వారు చికిత్స చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సాధారణంగా ఆసుపత్రులకు నిరంతరం విద్యుత్ సరఫరా ఉండాలి. కానీ బీహార్లో  అలా జరగడం లేదు. యాక్సిడెంట్ వంటి విషయాల్లో వెంటనే ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News