Monday, December 23, 2024

ఎంపీలో గ్రహాంతరవాసి వలే జన్మించిన శిశువు!

- Advertisement -
- Advertisement -

child born like alien

లక్నో: మధ్యప్రదేశ్‌లోని రత్‌లామ్ జిల్లాలో ఓ మహిళకు గ్రహాంతరవాసి(ఏలియన్) వంటి బిడ్డ జన్మించాడు. ఈ బిడ్డ ఇలా జన్మించడం చూసి చాలా మంది దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ బిడ్ద అవయవాలు పూర్తి అభివృద్ధి చెందలేదు కూడా. ఆ కారణంగా ప్రస్తుతం ఆ శిశువును చికిత్స కోసం ఎస్‌ఎన్‌సియూలో ఉంచారు. అందిన సమాచారం ప్రకారం బరవడకు చెందిన షఫీఖ్ భార్య సాజిదా ఈ వింత శిశువుకు జన్మనిచ్చింది. ఆ శిశువు శరీరంపై చర్మం మొలవనేలేదు. ఆ కారణంగా అతడి సిరలన్నీ స్పష్టంగా కనబడుతున్నాయి. కళ్లు, పెదవులు ఉబ్బి కనపడుతున్నాయి. సరిగ్గా ఎదగని ఆ శిశువు ఓ గ్రహాంతర వాసిలో కనపడుతున్నాడు. ఇలా ఉండడానికి కారణం జన్యు సమస్యేనని డాక్టర్లు చెబుతున్నారు. ఇక ఇలాంటి శిశువులను మెడికల్ టర్మినాలజీ ప్రకారం ’కొల్లోడియన్ బేబీస్‘ అంటారు. అవయవాలు సరిగ్గా వృద్ధి చెందని కారణంగా ఆ శిశువు ఆడ లేక మగ అనేది తెలియదని ఐసియూ ఇన్‌ఛార్జి డాక్టర్ నవేద్ ఖురైషి తెలిపారు. ఇలాంటి శిశువులకు వ్యాధి సంక్రమణల సమస్య ఎక్కువగా ఉంటుందని కూడా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News