Monday, December 23, 2024

ప్రతి పేదింటికి కెసిఆర్ మేనమామ: గంగుల

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: గతంలో త్రాగడానికి మంచినీరు లేక చెరువులు, చెలమలల్లో నీటిని త్రాగి విషజ్వరాలు, గత్తర వచ్చి తీవ్ర రోగాల బారిన పడేవారమని రాష్ట్ర బిసి సంక్షేమ  పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ పరిస్థితికి శాశ్వత పరిష్కారంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం మిషన్ భగీరథ కారక్రమాన్ని ప్రారంభించి ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీటిని అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. 5వ విడత పల్లె ప్రగతిలో భాగంగా కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్ గ్రామంలో గ్రామీణ క్రీడా ప్రాంగణాన్ని మంత్రి గంగుల కమలాకర్, జెడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శనివారం ప్రారంభించిన అనంతరం మంత్రులు వాలీ బాల్ ఆడారు. ఈ  సందర్భంగా గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఒకప్పుడు  ప్రతి పేదింటికి మేనమామగా మారి పెండ్లి ఖర్చుల కోసం  లక్షా 116 రూపాయలను అందించి, తొలికాన్పుకు కెసిఆర్ కిట్ ఇవ్వడంతో పాటు రూ.13 వేలు ఇవ్వడం తో పాటు వారికి మెరుగైన విద్యను అందించడానికి గురుకులాలను ప్రాంభించుకోవడం జరిగిందన్నారు.

యావత్ ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందని, ఒకప్పుడు నీళ్ళు పెట్టడానికి వెళ్తే సరైన కరెంట్ ఉండేది కాదని, దీనికారణంగా రైతులు పూర్తిస్థాయిలో పంటను పండించేవారు కాదన్నారు. దేశానికే అన్నంపెట్టే రైతన్న పంటను పండించడానికి కష్టపడరాదని, రాష్ట్రంలో 24 గంటల కరెంట్, మిషన్ భగీరథ ద్వారా నీటిని, పంట సహాయంగా రైతు బంధు అందించడం జరిగిందన్నారు. పండించిన పంట నుంచి చివరి గింజ వరకు కొనుగోలు చేసి నేరుగా బ్యాంకు ఖాతాలో డబ్బులు జమచేసేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.

తెలంగాణ సమాజం కడుపునిండా అన్నం పెట్టినవారికి మంచిగా బతకాలె, కడుపు చల్లగుండా నిండునూరేళ్లు బతకాలని దీవెనాలు ఇస్తామని,  ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు మనం చల్లగా బతికేలా ఉచిత కరెంటు, కాళేశ్వరం నీళ్లు, రైతుబందు, రైతుబీమా, ఆసరా ఫించన్లు, కళ్యాణలక్ష్మీ, కెసిఆర్ కిట్లు ఇలా ఎన్నో పథకాలు ఇచ్చారని, ఆయన నిండు నూరేళ్లు చల్లగా బతికి మనలాంటి ఎందరో తెలంగాణ బిడ్డల్ని చల్లగా చూసుకోవాలని దీవెనాలు ఇవ్వాలని ప్రజలకు మంత్రి గంగుల పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల్ల విజయ, అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, జెడ్పి సిఇఒ ప్రియాంక, అభివృద్ధి అధికారి శ్రీలత, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, జెడ్ పి టి సి పి, ఎంపిపి లక్ష్మయ్య, సర్పంచ్ కొట్టే జ్యోతి పోచయ్య, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News