- Advertisement -
మాస్కో : ప్రపంచ వ్యాప్తంగా ఇంధనం, ఆహార ధాన్యాల సంక్షోభం తలెత్తడానికి పశ్చిమ దేశాల వైఖరే కారణమని రష్యా అధ్యక్షుడు పుతిన్ నిందారోపణ చేశారు. సముద్రజలాల్లో మందుపాతరలు తొలగిస్తే ఉక్రెయిన్ నుంచి నౌకలు ఆహార ధాన్యాలను ఎగుమతి చేసుకోడానికి సురక్షిత జల మార్గాన్ని కల్పిస్తామని పదేపదే తమ ప్రభుత్వం అవకాశాలు ఇస్తున్నా పశ్చిమ దేశాలు తమ వైఖరిని మార్చుకోవడం లేదని ఆయన విమర్శించారు. సముద్ర జలాల్లో మందుపాతరలను తొలగించే పేరుతో సముద్రదాడులకు పాల్పడే అవకాశాన్ని తీసుకోమని పేర్కొన్నారు. మందుపాతరలు తొలగిస్తే ధాన్యం నౌకలపై రష్యా దాడులుండవని, ఉక్రెయిన్ రేవు బెర్డియాన్‌స్క్ నుంచి లేదా రష్యా ఆక్రమణలో ఉన్న బెలారస్, బెర్‌డైనాస్క్ తదితర దేశాల నుంచి నౌకలు రవాణా చేసుకోవచ్చని పుతిన్ స్పష్టం చేశారు.
- Advertisement -