అనుమతి లేకుండా అశ్లీల నృత్యాలు
12మందిని అదుపులోకి తీసుకున్న మాదాపూర్ పోలీసులు
మనతెలంగాణ, హైదరాబాద్ : సరైన అనుమతులు లేకుండా కొనసాగుతున్న పబ్బుపై మాదాపూర్ ఎస్‌ఓటి పోలీసులు శనివారం దాడి చేశారు. పబ్బు నిర్వాహకులు పరారీలో ఉండగా 12మందిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…శివప్రసాద్ రెడ్డి కెపిహెచ్‌బి పోలీస్ స్టేషన్ పరిధిలో క్లబ్ మస్తీ బిస్ట్రో బార్ అండ్ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. విష్ణు మేనేజర్‌గా పనిచేస్తున్నాడు, ప్రదీప్‌కుమార్, ప్రవీన్, ప్రియ, మమత, ప్రియాంక, రాజ్యలక్ష్మి, రమారెడ్డి, రాజమణి, ఎండి హీన, హర్షిత డ్యాన్సర్లుగా పనిచేస్తున్నారు. సాయిసంతోష్ కస్టమర్, డిజే ఆపరేటర్ ధన్‌రాజ్ ఉండగా ఇందులో ముగ్గురు పరారీలో ఉన్నారు. పబ్బు ఏర్పాటుకు నిర్వాహకులు ఎలాంటి అనుమతి తీసుకోకుండానే నడిపిస్తున్నారు. అంతేకాకుండా కస్టమర్లను ఆకట్టుకునేందుకు డ్యాన్సర్లను నియమించి వారితో గాలం వేసి అందినకాడికి దోచుకుంటున్నారు. డిజే సిస్టంను కూడా అనుమతి కంటే ఎక్కువగా పెట్టి నిర్వహిస్తున్నారు. అరెస్టు చేసిన 12మందిన కేసు దర్యాప్తు కోసం కెపిహెచ్‌బి పోలీసులకు అప్పగించారు. పబ్బు యజమాని శివప్రసాద్ రెడ్డి, మేనేజర్ విష్ణు, కృష్ణ కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఇన్స్‌స్పెక్టర్ శివప్రసాద్, ఎస్సైలు రాజశేఖర్ రెడ్డి తదితరులు పట్టుకున్నారు.