హైదరాబాద్: చిక్కడపల్లి పీఎస్ పరిధిలో చిన్నారుల కిడ్నాప్, విక్రయం కలకలం రేపింది. ఇద్దరు బెగ్గర్స్ దంపతులను కిడ్నాప్ చేసిన కిడ్నాపర్ వారి బాబును మరొకరికి అమ్మాడు. తమ మొదటి కొడుకుని 15 వేలకు ఓ వ్యక్తికి బెగ్గర్ దంపతులు విక్రయించారు. అనంతరం వారికి మరో బాబు పుట్టాడు. ఇది గమనించిన మొదటి బాబుని కొనుగోలు చేసిన వ్యక్తి.. ఈ బాబుని అమ్మాలని పథకం వేశాడు. బెగ్గర్ దంపతులకు మాయమాటలు చెప్పి, ఫుల్లుగా మద్యం తాగించి.. వారికి తెలియకుండా ఆ వ్యక్తి 1.5 లక్షలకు రెండో బాబును అమ్మేశాడు. దీంతో దంపతులు చిక్కడపల్లి పోలీసులకు పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు.. కిడ్నాపర్ మహమ్మద్ షరీఫ్ అలియాస్ సలీంతో పాటు 9 మందిని అరెస్ట్ చేశారు. ఇద్దరు బాబులను రక్షించిన పోలీసులు..వారిని శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు.
Child kidnapped in Chikkadpally