Monday, December 23, 2024

మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన సామ్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: స్టార్ బ్యూటీ సమంత చేతిలో ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. గుణశేఖర్ దర్శకత్వంలో నటించిన ’శాకుంతలం’ పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్‌ను జరుపుకుంటోంది. ‘యశోద’, విజయ్ దేవరకొండ సరసన నటిస్తున్న ‘ఖుషి’ చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అయితే తాజాగా సమంతకు మరో బంపర్ ఆఫర్ వచ్చినట్లు సమాచారం. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సరసన హీరోయిన్‌గా మరోసారి సమంత అవకాశం అందుకుందట. ‘విక్రమ్’ సినిమా చేసిన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ నెక్ట్స్ సినిమాను చేయనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా సమంతను ఎంపిక చేశారట. కాగా, ఇటీవలే ‘బీస్ట్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ ప్రస్తుతం తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ ఓ ద్విభాషా చిత్రాన్ని చేస్తున్నారు.

Samantha once again romance with Vijay Thalapathy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News