Monday, December 23, 2024

సిఎం స్టాలిన్ కు న‌య‌న‌తార-విఘ్నేష్‌ శివ‌న్‌ ఆహ్వానం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హీరోయిన్ నయనతార, విఘ్నేష్ శివ‌న్‌ వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. గత కొన్నాళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట ఎట్టకేలకు పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టనున్నారు. జూన్ 9న మ‌హాబ‌లిపురంలోని ఓ ఫైవ్ స్టార్ హోట‌ల్లో హిందూ సంప్ర‌దాయ ప‌ద్ధ‌తిలో వీరి పెళ్లి జరగనుంది. ఈ క్రమంలో తమ వివాహానికి రావాల్సిందిగా పలువురు ప్రముఖులను నయనతార, విఘ్నేష్ స్వయంగా ఆహ్వానిస్తున్నారు. తాజాగా ఈ జంట, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ను కలిసి తమ పెళ్లికి ఆహ్వానించారు. కోలీవుడ్, టాలీవుడ్ సినీ ప్రముఖులను కూడా నయనతార, విఘ్నేష్ ఆహ్వానించినట్లు తెలుస్తుంది. కాగా, ఇన్నాళ్లుగా తమ ప్రేమ వ్యవహారంపై వస్తున్న వార్తలకు నయనతార, విఘ్నేష్ లు ఎట్టకేలకు పుల్ స్టాప్ పెట్టారు.

Nayanthara and Vignesh Shivan Wedding on June 9th

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News