Tuesday, January 21, 2025

జనగామ జిల్లాలో ప్రమాదం: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

Three killed in Road accident in Janagama district

రఘునాథపల్లి: జనగామ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. టవేరా వాహనం టైరు పగిలి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. వరంగల్ నుండి హైదరాబాద్ కు వెళుతుండగా రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతులను వరంగల్ చింతల్ నగర్ కు చెందిన వారని పోలీసులు నిర్ధారించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News