Monday, December 23, 2024

ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యల ఫలితం

- Advertisement -
- Advertisement -

BJP Spokesperson Nupur Sharma suspended

బిజెపి అధికార ప్రతినిధుల సస్పెన్షన్

కాన్పూర్ : మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలపై పార్టీ అధికార ప్రతినిధులు నుపూర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్‌లను బిజెపి సస్పెండ్ చేసింది. ఈ ఇద్దరి వ్యాఖ్యలు ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఇతర ప్రాంతాలలో తీవ్రస్థాయి మత ఉద్రిక్తతలకు దారితీశాయి. దీనితో మేల్కొన్న బిజెపి అధినాయకత్వం తక్షణ దిద్దుబాటు చర్యలలో భాగంగా వీరిపై వేటు వేసింది. ఏ మత ప్రతినిధిని అయినా కించపరిచే విధంగా మాట్లాడటాన్ని తమ పార్టీ సహించేది లేదని, వీరి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బిజెపి అధికారిక ప్రకటనను ఆదివారం వెలువరించింది.

ప్రవక్తను తూలనాడుతూ మహిళ అయిన నుపూర్ శర్మ ఓ టీవీ చర్చాగోష్టిలో కొన్ని మాటలు చెప్పడం వివాదానికి దారితీసింది. దీనిపై పలు వర్గాల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. ప్రత్యేకించి మతపరంగా సున్నితంగా ఉండే యుపి నగరాలలో ఉద్రిక్తత ఏర్పడింది. ఈ దశలో బిజెపి అధికార ప్రకటన వెలువరించింది. వీరిని పార్టీ ప్రతినిధులుగా తాత్కాలికంగా పక్కన పెడుతున్నట్లు తెలిపింది. బిజెపి అన్ని మతాలను ఆదరిస్తుంది. తరతరాలుగా భారతదేశంలో ప్రతి మతం విలసిల్లింది. వికసించింది. ఏ మతాన్ని అయినా ఎవరైనా కించపరిచే విధంగా మాట్లాడినా, ఏ మతం దూత లేదా ప్రతినిధిని అవమానం చేసినట్లు వ్యాఖ్యలకు దిగినా అది అనుచితమే అవుతుందని బిజెపి తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News