Monday, November 25, 2024

రెండు రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక సమర్పించండి

- Advertisement -
- Advertisement -

Submit full report within two days: Governor Tamilisai

గవర్నర్ తమిళిసై సౌందర రాజన్

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఘటనపై రెండు రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక అందించాలని గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఆదేశించారు. బాలికపై అత్యాచార ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని తెలిపారు. ఈ మేరకు సమగ్ర నివేదిక సమర్పించాలని సిఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డిని కోరారు. అత్యాచార ఘటనపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మీడియాలో వస్తున్న కథనాలను నిశితంగా పరిశీలించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమంటూ తమిళిసై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఇప్పటికే ప్రతిపక్షాలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగాయి. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ కాంగ్రెస్ శ్రేణులు డిజిపి కార్యాలయాన్ని ముట్టడించాయి. ఈ ఘటనపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కేసును సిబిఐకి అప్పగించాలంటూ బిజెపి నేతలు డిజిపిని కలిసి వినతిపత్రం సమర్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News