- Advertisement -
బిసి గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి- మల్లయ్య బట్టు
మనతెలంగాణ/ హైదరాబాద్ : డిగ్రీ, ఇంటర్ కోర్సుల్లో చేరేందుకు ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 88 శాతం విద్యార్థులు హాజరయ్యారని మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి మల్లయ్య బట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా బిసి గురుకుల కాలేజీల్లో ఇంటర్ కోర్సుల కోసం 45735 మంది దరఖాస్తు చేసుకోగా 40575 మంది విద్యార్థులు హాజరయ్యారని ఆయన పేర్కొన్నారు. మహిళా డిగ్రీ కాలేజీలో ప్రవేశం కోసం 6170 మంది అమ్మాయిలు దరఖాస్తు చేసుకోగా 5144 మంది విద్యార్థులు హాజరయ్యారని ఆయన తెలిపారు.
- Advertisement -