Saturday, December 21, 2024

3,80,202

- Advertisement -
- Advertisement -

గ్రూప్-1కు
దరఖాస్తుల వెల్లువ

వీరిలో 53వేల మంది
ప్రభుత్వ ఉద్యోగులే
త్వరలో ప్రిలిమ్స్, మెయిన్స్
తేదీలపై టిఎస్‌పిఎస్‌సి స్పష్టత

మన : రాష్ట్రంలో వెలువడిన తొలి గ్రూప్-1కు దరఖాస్తులు వెల్లువెత్తా యి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత వెలువడిన ఈ నోటిఫికేషన్‌కు ఉమ్మడి రాష్ట్రంలో గ్రూ ప్-1 ప్రకటన సమయంలో వచ్చినవాటి కన్నా అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు వస్తాయి. మొత్తం 503 పోస్టులతో కూడిన గ్రూప్-1 నోటిఫికేషన్‌కు రికార్డుస్థాయిలో 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టిఎస్‌పిఎస్‌సి) వెల్లడించింది. ఏప్రిల్ 26న టిఎస్‌పిఎస్‌సి గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేయగా, మే 2వ తేదీ నుంచి దరఖాస్తు ల ప్రక్రియ ప్రారంభమైంది. మే 31 వరకు దరఖాస్తుకు గడువును విధించించగా, వివిధ కారణాల వల్ల దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థు ల విజ్ఞప్తుల మేరకు కమిషన్ దరఖాస్తు గడువును ఈ నెల 4 వరకు పొడిగించింది. గ్రూప్-1 దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు గడువు ము గుస్తున్న సమయంలో ఇబ్బంది పడకుండా ముం దుగానే నూతన రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఇదివరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు సవరించుకోవాలని టిఎస్‌పిఎస్‌సి తెలిపింది. దరఖాస్తుల ప్రక్రియ సర్వర్ ఒత్తిడి పెరగకుండా, అభ్యర్థులకు సాంకేతిక ఇబ్బందులు రాకుండా కమిషన్, సిజి జి అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. దరఖా స్తు ప్రక్రియలో సమస్యల పరిష్కారానికి కమిషన్ వెబ్‌సైట్‌లో ప్రత్యేకంగా ‘రేయిజ్ ఎ గ్రివియెన్స్’ పేరిట ప్రత్యేక సౌకర్యం అందుబాటులో ఉంచడంతోపాటు సమస్యల పరిష్కరించేందుకు స్పెషల్ గ్రివియెన్స్ సెల్‌ను ఏర్పాటు చేసింది.

రెండు రోజులపాటు అత్యధికంగా రోజుకు 42,500 దరఖాస్తులు

ఉమ్మడి రాష్ట్రంలో 2011లో 312 పోస్టులతో వెలువడిన గ్రూప్ -1 ప్రకటనకు 3 లక్షల మంది దరఖాస్తు చేయగా, తెలంగాణ రాష్ట్రంలో 503 పోస్టులతో వెలువడిన తొలి గ్రూప్ 1 నోటిఫికేషన్‌కు 3,80,202 మంది దరఖాస్తు చేశారు. మే 2 నుంచి 16 వరకు రోజు 8 వేల చొప్పున 15 రోజుల్లో 1,26,044 దరఖాస్తులు వచ్చాయి. ఆ తర్వాత 13 రోజులు (మే 13 నుంచి 31 వరకు) రోజుకు 10,769 దరఖాస్తుల చొప్పున 1,40,539 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మే 30,31 తేదీలలో రెండు రోజులపాటు సగటున రోజుకు 42,500 దరఖాస్తుల చొప్పున 85 వేల దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు గడువు పొడిగించిన తర్వాత ఈ నెల 1 నుంచి 4 వరకు రోజుకు 7,139 దరఖాస్తుల చొప్పున 28,559 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు.

పీహెచ్‌డీ చేసిన వాళ్లు 1,681 మంది

గ్రూప్ 1కు 1,22,826 మంది పోస్టు గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకోగా, ఎం.ఫిల్ చేసిన వాళ్లు 424 మంది,పిహెచ్‌డిలు చేసిన అభ్యర్థులు 1,681 మంది దరఖాస్తు చేశారు. మొత్తం దరఖాస్తుదారుల్లో 2,53,490 గ్రాడ్యుయేట్లు ఉండగా, 1,781 మంది ఇంటిగ్రేటెడ్ డిగ్రీ(గ్రాడ్యుయేషన్+పిజి) చేసిన వాళ్లు ఉన్నారు. ఈ నోటిఫికేషన్‌కు 53,553 మంది ప్రభుత్వ ఉద్యోగులు దరఖాస్తు చేశారు. 6,105 మంది వికలాంగులు దరఖాస్తు చేశారు. మొత్తం దరఖాస్తుదారుల్లో 2,28,951 మంది పురుషులు కాగా, 1,51,192 మంది మహిళలు, 59 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు.

త్వరలో పరీక్షల తేదీలు

గ్రూప్ 1 దరఖాస్తుల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ప్రిలిమ్స్, మెయిన్స్ తేదీలపై టిఎస్‌పిఎస్‌సి కసరత్తు చేస్తోంది. అభ్యర్థుల విజ్ఞప్తులను, ఇతర పరీక్షల తేదీలను దృష్టిలో ఉంచుకుని పరీక్షల తేదీలు ఖరారు చేయనుంది. త్వరలో గ్రూప్ 1 ప్రిలిమ్స్, మెయిన్స్ తేదీలు ప్రకటిస్తామని, అభ్యర్థులు రెగ్యులర్‌గా కమిషన్ వెబ్‌సైట్ చూడాలని కమిషన్ తెలిపింది.

ఈ నిబంధనకు సడలింపులో పెరిగిన దరఖాస్తులు

గ్రూప్ 1 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైన వారం రోజులపాటు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. ఒటిఆర్ సవరణ, స్థానికతకు సంబంధించి బోనఫైడ్ అప్‌లోడ్ తదితర అంశాల నేపథ్యంలో దరఖాస్తు ప్రక్రియ నెమ్మదిగా సాగింది. స్థానికత ధ్రువీకరణకు కీలకమైన బోనఫైడ్‌లు అందుబాటులో లేని పలువురు అభ్యర్థులు పాఠశాలల చుట్టూ తిరుగుతుండడం మరోవైపు పరీక్షకు సన్నద్ధం కావాలనే తాపత్రయంతో కొందరు అభ్యర్థులు ఆందోళన చెందారు. ఈక్రమంలో బోనఫైడ్ అప్‌లోడ్ నిబంధనకు బ్రేక్ ఇచ్చిన్ టిఎస్‌పిఎస్‌సి.. చదువుకున్న వివరాలను సరిగ్గా ఎంట్రీ చేస్తే చాలని సూచించింది. దీంతో దరఖాస్తు నమోదు వేగం పుంజుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News