కొన్ని ముస్లిం దేశాల నిరసనలతో, ప్రవక్తపై వ్యాఖ్యలపై వివాదం పెరగడంతో బిజెపి తన జాతీయ అధికార ప్రతినిధి నూపుర్ శర్మను సస్పెండ్ చేసింది. ఢిల్లీ మీడియా హెడ్ నవీన్ కుమార్ జిందాల్‌ను బహిష్కరించింది.
న్యూఢిల్లీ: ప్రవక్త ముహమ్మద్(స)పై ఇటీవల బిజెపి నేతలు నూపుర్ శర్మ , నవీన్ కుమార్ జిందాల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి. చిదంబరం సోమవారం ప్రతిపక్ష నాయకులతోపాటు కేంద్రాన్ని విమర్శించారు.
బిజెపి ఆదివారం తన జాతీయ అధికార ప్రతినిధి నూపుర్ శర్మను సస్పెండ్ చేసింది, దాని ఢిల్లీ మీడియా హెడ్ నవీన్ కుమార్ జిందాల్‌ను బహిష్కరించింది, కొన్ని ముస్లిం దేశాల నుండి నిరసనలు వెల్లువెత్తడంతో ప్రవక్తపై వారి వ్యాఖ్యలపై వివాదం తీవ్రమైంది.
“శ్రీమతి నూపుర్ శర్మ మరియు శ్రీ నవీన్ కుమార్ ఇస్లామోఫోబియా యొక్క అసలైన సృష్టికర్తలు కాదు. గుర్తుంచుకోండి, వారు రాజు కన్నా ఎక్కువ విధేయులుగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. ఆ ఇద్దరు అధికార ప్రతినిధులకు వ్యతిరేకంగా వ్యవహరించడానికి బిజెపిని దేశీయ విమర్శలు ప్రేరేపించలేదు. ఇది అంతర్జాతీయంగా ఎదురుదెబ్బ మాత్రమే. చర్య తీసుకునేలా బిజెపిని త్రోసింది’’ అని చిదంబరన్ ట్వీట్ చేశారు.
దాదాపు 10 రోజుల క్రితం టీవీ చర్చలో నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు, జిందాల్ ఇప్పుడు తొలగించేసిన ట్వీట్లు కొన్ని దేశాల్లో భారతీయ ఉత్పత్తులను బహిష్కరించాలని పిలుపునిచ్చే ట్విట్టర్ ట్రెండ్‌ను రేచ్చగొట్టాయి.
Mrs Nupur Sharma and Mr Naveen Kumar were not the original creators of the Islamophobia
Remember, they were trying to more loyal than the king
— P. Chidambaram (@PChidambaram_IN) June 6, 2022