- Advertisement -
రాంచీ: కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్న తన పాస్ పోర్ట్ ను రిన్యూవల్ కోసం విడుదల చేయాల్సిందిగా రాష్ట్రీయ జనతాదళ్(ఆర్ జెడి) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ రాంచీలో సిబిఐ కోర్టుకు వినతి చేసుకున్నారు. ‘లాలూప్రసాద్ యాదవ్ కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ కోసం సింగపూర్ వెళ్లనున్నారు. అక్కడి డాక్టర్ల అపాయింట్ మెంట్ ప్రాసెస్ లో ఉంది. ఈ లోగా పాస్ పోర్టు రిన్యూవల్ కోసం కోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. రిన్యూ పాస్ పోర్టును తిరిగి కోర్టుకు సమర్పించడం జరుగుతుంది’’ అని ఆయన న్యాయవాది ప్రభాత్ యాదవ్ తెలిపారు.
- Advertisement -