- Advertisement -
ముంబై: కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ బొమ్మకు బదులుగా వేరే వ్యక్తుల బొమ్మలను ముద్రించే ప్రతిపాదన ఏదీ లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోమవారం స్పష్టం చేసింది. కరెన్సీ నోట్లపై ప్రస్తుతం ఉన్న మహాత్మా గాంధీకి బదులుగా వేరే వ్యక్తుల బొమ్మలను ముద్రించే విషయాన్ని ఆర్‌బిఐ పరిశీలిస్తున్న కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయని, అయితే అటువంటి ప్రతిపాదన ఏదీ తమ వద్ద లేదని ఆర్‌బిఐ తెలిపింది. కాగా..మహాత్మా గాంధీ స్థానంలో రవీంద్రనాథ్ ఠాగూర్, ఎపిజె అబ్దుల్ కలామ్ తదితర భారతీయ ప్రముఖుల బొమ్మలను కరెన్సీ నోట్లపై ముద్రించే విషయాన్ని ఆర్థిక శాఖ, ఆర్‌బిఐ పరిశీలిస్తున్నట్లు కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
No Plans to Replace Mahatma Gandhi on Currency: RBI
- Advertisement -