- Advertisement -
కోల్‌కతా : రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగే యూనివర్శిటీలకు ముఖ్యమంత్రి మమతాబెనర్జీయే ఛాన్సలర్‌గా ఉండాలంటూ పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కొద్ది రోజులుగా వాదిస్తోంది. అయితే ఈ విషయమై అక్కడి ప్రభుత్వం తాజాగా ముందడుగు వేసింది. రాష్ట్ర పరిధి లోని యూనివర్శిటీలకు ముఖ్యమంత్రి మమతాబెనర్జీయే ఛాన్సలర్‌గా కొనసాగేలా తీసుకు వచ్చిన బిల్లును పశ్చిమబెంగాల్ కేబినెట్ సోమవారం ఆమోదించింది. ఆరోగ్యం, వ్యవసాయం, పశుసంవర్థక, మైనారిటీ వ్యవహారాల శాఖ వంటి వివిధ శాఖల పరిధి లోని యూనివర్శిటీలు తాజా ప్రతిపాదన పరిధి లోకి వస్తాయి. ఇవి ఇప్పటివరకు రాష్ట్ర గవర్నర్ జగ్జీవ్ ధన్‌కర్ పరిధిలో ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రపరిధి లోని యూనివర్శిటీలకు ఆయనే ఛాన్సలర్‌గా కొనసాగుతున్నారు. కాగా, రాష్ట్ర ప్రతిపాదన అమలు లోకి వస్తే ఆ స్థానాన్ని మమతాబెనర్జీ భర్తీ చేస్తారు.
- Advertisement -