Friday, December 20, 2024

వాతావరణ మార్పులపై కాల్‌ టు యాక్షన్‌ ను ప్రారంభించిన టాటా టీ జాగోరే

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: టాటా టీ ఆదివారం తమ తాజా ఎడిషన్‌ జాగోరే ప్రచారం ప్రారంభించింది. దీని ద్వారా వాతావరణ మార్పులను గురించి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. గత కొన్ని దశాబ్దాలుగా వాతావరణ మార్పుల కారణంగా ఎదురవుతున్న సమస్యలు అసాధారణంగా మారాయి. 2021లో ‘సేవ్‌ ద చిల్డ్రన్‌’ విడుదల చేసిన అధ్యయనాల ప్రకారం, ప్రస్తుత విధానంలోనే భూమి వేడెక్కిపోతే, గత దశాబ్దంలో పుట్టిన, ఇకపై పుట్టబోయే చిన్నారులు మరింతగా వేడిగాలులు, వరదలు, కరువులు, అగ్ని ప్రమాదాలు ఎదుర్కొంటారు. ఇదే తరహా నివేదికను యునిసెఫ్‌ సైతం విడుదలచేయడంతో పాటుగా పలు దేశాలలో నూరు కోట్ల మంది చిన్నారుల జీవితంలో ప్రమాదంలో ఉన్నాయని హెచ్చరించింది.

గత కొద్ది సంవత్సరాలుగా టాటా టీ యొక్క జాగోరే కార్యక్రమం ద్వారా సమాజాన్ని మేల్కొలిపేందుకు ప్రయత్నిస్తుంది. ఈ ఎడిషన్‌ టాటా టీ జాగోరే ద్వారా వాతావరణ మార్పులు సామాన్యులపై ఏ విధమైన ప్రభావం చూపుతామో వెల్లడిస్తోంది. తమ 15వ సంవత్సరంలో టాటా టీ జాగోరే ప్లాట్‌ఫామ్‌ ఇప్పుడు నూతన టీవీసీ రూపొందించింది. సుప్రసిద్ధ నటుడు పంకజ్‌ త్రిపాఠీ దీనిలో కనిపించనున్నారు. ముల్లెన్‌ లింటాస్‌ తీర్చిదిద్దిన ఈ టీవీసీని ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజు విడుదల చేయనున్నారు. ఈ టీవీసీ ద్వారా మీ కోసం కాకపోతే, మీ పిల్లల భవిష్యత్‌ కోసమైనా మేల్కొనండి అని చెబుతున్నారు.

ఈ కార్యక్రమం గురించి పునీత్‌ దాస్‌, అధ్యక్షులు–ప్యాకేజ్డ్‌ బేవరేజస్‌ (ఇండియా అండ్‌ సౌత్‌ ఆసియా ) మాట్లాడుతూ ‘‘టాటా టీ జాగోరే కార్యక్రమాలెప్పుడూ కూడా సమాజాన్ని మేల్కొలిపే రీతిలోనే ఉంటాయి. వాతావరణ మార్పులు, దాని ప్రభావం గురించి ఎంతో కాలంగా చర్చిస్తున్నారు కానీ చిన్నారులపై దాని ప్రభావం ఎంత అనేది తెలుసుకోవాల్సి ఉంది. ప్రస్తుత ఎడిషన్‌ జాగోరే లో మన చిన్నారులను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను తెలిపాము. తద్వారా వారికి మెరుగైన భవిష్యత్‌ అందించగలము. తల్లిదండ్రులు, వ్యక్తులు తీసుకునే కొద్ది పాటి జాగ్రత్తలు కూడా భావి తరాలకు ఆవాసంగా ఈ భూమిని ఆహ్లాదకరంగా మార్చనున్నాయి’’ అని అన్నారు.

‘‘జాగోరే తన 15వ సంవత్సరంలో పంకజ్‌ త్రిపాఠీతో తిరిగి వచ్చింది. అంతేకాదు ఈ ప్రచారంలో మొట్టమొదటిసారిగా ఓ పిల్లవాడిని కథధానాయకునిగా చేయడం ద్వారా సమస్య యొక్క ప్రాముఖ్యతను తెలిపే ప్రయత్నం చేశాము’’ అని గరిమా ఖండేల్‌వాల్‌, చీఫ్‌ క్రియేటివ్‌ ఆఫీసర్‌– ముల్లెన్‌ లింటాస్‌ అన్నారు.

Tata Tea Jagore launches Call To Action to fight for climate changes

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News