- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో పురపాలక, పంచాయతీరాజ్ శాఖల్లో ఉద్యోగాల నియామకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా మరో 1433 ఉద్యోగాల నియామకానికి రాష్ట్ర ఆర్థికశాఖ అనుమతిచ్చింది. పురపాలక, పంచాయతీరాజ్ శాఖల్లో ఖాళీల భర్తీకి నోటీఫికేషన్ విడుదల చేసింది. అందులో 657 ఏఈఈ, 113 ఏఈ , హెల్త్ అసిస్టెంట్లు, శానిటరీ ఇన్ స్పెక్టర్లు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది, అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్,ఏఎస్ఓ తదితర పోస్టులు ఉన్నాయి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఇప్పటివరకు 35,220 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ పచ్చజెండా ఊపింది. 80,039 ఉద్యోగాలు భర్తీ చేస్తామని అసెంబ్లీలో సిఎం కెసిఆర్ ప్రకటించిన ముచ్చట తెలిసిందే.
- Advertisement -