Monday, December 23, 2024

24న ‘టెన్త్ క్లాస్ డైరీస్’

- Advertisement -
- Advertisement -

అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన తారలుగా ఎస్‌ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్స్ పతాకాలపై రూపొందిన చిత్రం ‘టెన్త్ క్లాస్ డైరీస్’. అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంతో ప్రముఖఛాయాగ్రాహకులు ’గరుడవేగ’ అంజి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఈనెల 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు ప్రేక్షకులకు చేరువయ్యాయి. సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన అవికా గోర్ పరిచయ గీతం ‘ఎగిరే ఎగిరే…’తో పాటు ’పియా పియా…’, ‘కుర్రవాడా కుర్రవాడా…’ పాటలకు, ప్రత్యేక గీతం ’సిలకా సిలకా’కు మంచి స్పందన లభించింది. నిర్మాతల్లో ఒకరైన అచ్యుత రామారావు మాట్లాడుతూ ఈ చిత్రాన్ని నైజాంలో ఏషియన్ సునీల్‌కి చెందిన గ్లోబల్ సినిమాస్ సంస్థ విడుదల చేస్తోందని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News