Saturday, November 23, 2024

ప్రాక్టీస్.. ప్రాక్టీస్

- Advertisement -
- Advertisement -

టీమిండియా ఆటగాగళ్లు నెట్స్‌లో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. హెచ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ నేతృత్యంలో ఢిల్లీ అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో మొదలైన ఈ ప్రాక్టీస్ సెషన్‌లో మంగళవారం భారత ఆటగాళ్లు చమటోడ్డారు. ఈ నెల 9 నుంచి సౌతాఫ్రికాతో ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. బౌలింగ్, బ్యాటింగ్‌లలో సమతూకంగా కనిపిస్తున్న టీమిండియా ఈ సిరీస్‌లో ఏ మేరకు రాణిస్తారనేది క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ నెకొంది. ప్రస్తుతం భారత జట్టులోని ఆటగాళ్లు ఇటీవలె ముగిసిన మెగా టోర్నీ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కెఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్, రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్, శ్రేయాస్ అయ్యార్‌లు బ్యాట్‌తో విజృంభించగా హార్దిక్ పాండ్య, ఇషన్ కిషన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఇక బౌలింగ్ విభాగం సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్, యాజువేంద్ర చాహల్, కుల్‌దీప్ యాదవ్, అక్షర్ పటేల్, కొత్తగా హర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్‌లు బంతితో మమఅనిపించారు. కాగా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు విశ్రాంతినివ్వడం, జట్టు దాదాపుగా అందరూ యువకులే కావడంతో ఈ పోట్టి క్రికెట్‌లో ఏమేరకు రాణిస్తారో వేచి చూడాలి.
-మన తెలంగాణ/క్రీడా విభాగం

పటిష్టంగా బ్యాటింగ్ లైనప్..

ఐపిఎల్15 సీజన్‌లో కెఎల్ రాహుల్ లక్నో జియాంట్స్ తరఫున బరిలోకి దిగిన అతను 15 మ్యాచ్‌లు ఆడాడు. 56.33 సగటుతో 616 పరగుతో రెండో స్థానంలో నిలిచాడు. అంతేకాకుండా15.38 స్ట్రైక్ రేట్ రాణించిన రాహుల్ రెండు సెంచరీలు నమోదు చేశాడు. అంతేకాకుండా లక్నో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి జట్టును సెమీ ఫైనల్‌కు చేర్చాడు. ఇక చెన్నై తరఫున ఆడిన రుతురాజ్ గైక్వాడ్ 26.29 సగటుతో 368 పరుగులు చేశాడు. అందులో మూడు అర్ధ శతకాలు ఉన్నాయి. మరో ఆటగాడు ఇషాన్ కిషన్ ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడి 30.83 సగటుతో 418 పరుగులు చేశాడు. దీపక్ హుడా 14 ఇన్నింగ్స్‌లో 451 పరుగులు చేయగా రిషభ్ పంత్ 340, హార్దిక్ పాండ్య 487 పరుగులు చేసి, అటు బౌలింగ్‌లోనూ ఆకట్టుకున్నాడు. ఇక బెంగళూరు తరఫున బరిలోకి దిగిన దినేశ్ కార్తీక్ ఒక హాఫ్ సెంచరీతో పరుగుల వరద పారించాడు. ఈ సీజన్ 16 ఇన్నింగ్స్ ఆడిన కార్తీక్ 55.00 సగటుతో 330 పరగులు సాధించాడు. ఈ విధంగా చూసుకుంటే భారత బ్యాటింగ్ లైనప్ చాలా పటిష్టంగా కనిపిస్తుంది.
బౌలింగ్ విభాగం..
భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, కుల్‌దీప్ యాదవ్, యాజువేంద్ర చాహల్ వంటి బౌలర్లు ఐపిఎల్‌లో బంతితో చెలరేగారు. యువ స్పిన్నర్ చాహల్ 17 ఇన్నంగ్స్‌లో బరిలోకి దిగి 19.51 సగటుతో 27 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. అంతేకాదు రెండు మ్యాచ్‌లలో 5/40, 4/28 రాణించి రాజస్థాన్ రాయ ల్స్ విజయాల్లో కీలక భూమిక పోషించాడు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున బరిలోకి దిగిన ఉమ్రాన్ మాలిక్ 22 వికెట్టు పడగొట్టి, గంటకు 146 నుంచి 153 కి.మీ. వేంగంతో బంతులు విసురుతూ ప్రత్యార్థి బ్యాటర్లను హడలేత్తించాడు. హర్షల్ పటేల్ 19 వికెట్లు, చైనామన్ బౌలర్ కుల్‌దీప్ యాదవ్ 21 వికెట్లు పడగొట్టగా సీనియర్ పేసర్ భువి కేవలం 12 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. కాగా, ముఖ్యంగా కొత్తగా జట్టులోకి వచ్చిన ఉమ్రాన్ మాలిక్‌పైనే అందరి దృష్టి పడింది. ఇక ఈ సిరీస్ ఉమ్రాక్‌కు మంచి అవకాశం కాగా, అతను ఏ మేరుకు సద్వినియోగం చేసుకుంటాడో వవేచిచేడాలిదే.

అందరి దృష్టి ఉమ్రాన్‌పైనే..

ఈ సిరీస్‌లో అందరి దృష్టి ఉమ్రాన్ మాలిక్‌పైనే ఉంది. ఐపిఎల్‌లో సన్ రైజర్స్ తరఫున బరిలోకి దిగిన ఉమ్రాన్ 150 కి.మీ.తో బంతులేస్తూ అందరినీ ఆకర్సించాడు, వరుస వికెట్లు పడగొట్టి సెలెక్టర్లను ఆకర్షించాడు. మాలిక్ ప్రతి మ్యాచ్‌లోనూ అత్యంత వేగవంతమైన బంతితో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 20.18 సగటుతో అతను 22 వికెట్లు తీశాడు. చాలామంది దిగ్గజ ఆటగాళ్లు అతడిని అభినందించారు. భారత జట్టులో అతనికి చోటు ఖాయమని కూడా అన్నారు. ఆ మాటను నిజం చేస్తూ భారత క్రికెట్ జట్టులో చోటు సంపాదించాడు మాలిక్. కాగా, సౌతాఫ్రికాతో టి20 సిరీస్‌లో ఇదే తరహాలో రాణిస్తే భవిషత్‌లో ఆస్రేలియా, ఇంగ్లండ్ వంటి విదేశాల్లో జరిగే సిరీస్‌లకు ఎంపికవ్వడం తప్పనిసరి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News