Friday, December 20, 2024

దళిత బంధు పథకం ప్రవేశపెట్టిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే: కలెక్టర్

- Advertisement -
- Advertisement -

Vehicles distribute to Dalitbandhu benificairies in Amberpet

 

మన తెలంగాణ, హైదరాబాద్ : దళిత బంధు లాంటి పథకం దేశంలో ఏప్రభుత్వాలు అమలు చేయడం లేదని, ఒక తెలంగాణ ప్రభుత్వమే సమర్దవంతంగా అమలు చేస్తుందని జిల్లా కలెక్టర్ శర్మన్ పేర్కొన్నారు. బుధవారం అంబర్‌పేట నియోజకవర్గంలోని ప్లే గ్రౌండ్‌లో జరిగిన దళిత బంధు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సత్సంకల్పంతో ప్రారంభించినందున ఈపథకం విజయవంతమైతుందని, ప్రభుత్వం ఆశించిన ఫలితాలు వచ్చినప్పుడే ఈపథకం విజయవంతమైనట్లు అవుతుందన్నారు. పేదలు ఆర్దిక పరిస్దితి మెరుగుపరుచుకోవడమే కాకుండా చుట్టు ఉన్నవారికి కూడ ఆర్దికంగా తోడ్పడుతుందన్నారు. అందరు అభివృద్ది చెందితేనే మన ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సంతోష పడుతారని చెప్పారు.

అనంతరం అంబర్‌పేట శాసనసభ్యులు కాలేరు వెంకటేష్ ప్రసంగిస్తూ ఎన్ని రోజుల నుంచో ఎదురుచూస్తున్న ఈకార్యక్రమాన్ని ఈరోజు అంబర్‌పేట నియోజకవర్గంలో ప్రారంభిస్తున్నామని, ఈపథకం దేశంలో ఎక్కడలేదని, దళితులందరిని ఆర్దికంగా పైకి తీసుకరావడానికి సిఎం కెసిఆర్ తీసుకొచ్చిన గొప్ప పథకమమన్నారు. అందరూ కోరుకున్న విధంగానే వాహనమే, ఏదైనా వ్యాపారం ప్రారంభించుకోవడానికి లబ్దిదారులకు అవకాశం ఇచ్చినట్లు చెప్పారు. ఈపథకం అందరికి సంబంధించినదని దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. బుధవారం 21మంది లబ్దిదారులకు వాహనాలు పంపిణీ చేసినట్లు, ఇప్పటికే మా కార్యాలయంలో 700 దరఖాస్తులు ఉన్నాయని ఇంకా 800మంది దరఖాస్తు చేసుకోవాలని మొత్తం నియోజకవర్గంలో 1500 మందికి దళిత బంధు పథకం కింద లబ్దిదారులను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఈకార్యక్రమంలో స్దానిక కార్పొరేటర్ విజయకుమార్‌గౌడ్, దూసరి లావణ్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడి రమేష్, స్దానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News