Tuesday, December 24, 2024

కదులుతున్న బస్సులో అమ్మాయిపై గ్యాంగ్ రేప్

- Advertisement -
- Advertisement -

Girl gang raped on moving bus in Bihar

పాట్నా: బీహార్‌లోని ఈస్ట్ చంపారన్ జిల్లాలో కదులుతున్న బస్సులో 17 ఏళ్ల అమ్మాయిపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేశారు. పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు… మోతిహరి బస్టాండ్‌లో బాలిక(17) తన సొంతూరుకు వెళ్లడానికి బస్సు కోసం ఎదురుచూస్తుంది. చంపారన్ ప్రాంతానికి వెళ్తున్నట్టు బస్ డ్రైవర్ బెట్టయ్య చెప్పడంతో అమ్మాయి బస్సు ఎక్కింది. మత్తు మందు కలిపిన కూల్ డ్రింకు ఆమెకు ఇవ్వడంతో తాగింది. స్పృహ తప్పి పడిపోయిన తరువాత ఆమెపై బస్సు డ్రైవర్, కండక్టర్, హెల్పర్, మరొక వ్యక్తి అత్యాచారం చేశారు. బాలిక స్పృహలోకి రాగానే బస్సు డోర్లు వేసి ఉన్నాయని చెప్పింది. స్థానికులు బస్సు డోర్లు తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఈ అమ్మాయిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. బస్సు సీజ్ చేశామని నలుగురిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News