హైదరాబాద్: అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా బిజెపి నేతలు మారారని, కాంగ్రెస్ పార్టీవి పగటి కలలు అని మంత్రి హరీష్ రావు విమర్శించారు. హైదరాబాద్ లోని తన నివాసంలో సిద్దిపేట పట్టణానికి చెందిన జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి దరిపల్లి శ్రీను, బీజేపీ పట్టణ మైనార్టీ అధ్యక్షుడు ఇబ్రహీం, కాంగ్రెస్ నాయకులు కృష్ణ పురం బాబు తో పాటు 100 మంది గురువారం మంత్రి హరీశ్ రావు సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…. రెండు జాతీయ పార్టీలు నాటి నుండి నేటి వరకు తెలంగాణకు అన్యాయం చేస్తునాయన్నారు. నాడు సమైక్య పాలనలో కాంగ్రెస్ పార్టీ అన్యాయం చెస్తే నేడు స్వరాష్ట్రం లో కేంద్రంలోని బిజెపి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. మన పథకాలు కాపీ కొట్టి మేమే చేసాం అని అబద్దాలు ఆడుతూ, ఫేక్ సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా బిజెపి నేతలని పిలవాలని ఎద్దేవా చేశారు. బిజెపి ఎన్ని జిమ్మిక్కులు చేసిన తెలంగాణ ప్రజలు విశ్వసించరన్నారు.
ఇక తెలంగాణలో కాంగ్రెస్ కనుమరుగైన పార్టీ అని, కాంగ్రెస్ నేతలవి పగటి కలలన్నారు. తెలంగాణ ప్రజల గుండె చప్పుడు, ప్రజల ఇంటి పార్టీ టిఆర్ఎస్ఏనని, సీఎం కేసీఆర్ నాయకత్వం లో అభివృద్ధి సంక్షేమం లో తెలంగాణ ఒక స్వర్ణయుగం అని దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకుంటే.. సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి కాకుంటే నేను మంత్రిగా లేకుంటే సిద్దిపేట జిల్లా అయ్యేదా.. సిద్దిపేటకు సాగు,త్రాగు నీరు వచ్చేదా అని అన్నారు. స్వరాష్ట్రం వల్లనే దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా సిద్దిపేట పేరు నిలిచిందన్నారు. సిద్దిపేటను జిల్లా చేస్కున్నము.. సాగు త్రాగు నీటి కలను నెరవేర్చినం.. కొద్దీ రోజుల్లోనే రైలు రాబోతుంది. సిద్దిపేట సమగ్ర అభివృద్ధి ప్రజలు కోరుకున్న అభివృద్ధిని చేసి చూపెట్టినం అని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధికి ఆకర్షితులై, మేము అభివృద్ధి భాగస్వామ్యం అవుతాం అంటూ బీజేపీ, కాంగ్రెస్ నుండి టిఆర్ఎస్ పార్టీ లో చేరిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నా అని పేర్కొన్నారు. అందరికి పార్టీలో సముచిత స్థానం కలిపిస్తానని చెప్పారు. పార్టీ లో వచ్చిన 100 మందిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అభివృద్ధి కి ఆకర్షితులై…అభివృద్ధి భాగస్వామ్యం ..
టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న వివిధ పార్టీ లకు చెందిన పలువురు నేతలు..
సిద్దిపేట అంటే అభివృద్ధి.. అభివృద్ధి అంటే హరిశ్ రావు.సిద్దిపేట నియోజకవర్గం దేశంలో నే ఆదర్శంగా నిలుస్తోంది. మంత్రి హరీష్ రావు గారి అభివృద్ధి మార్క్ కు ఇది ఒక నిదర్శనమని పార్టీ లో చేరిన దరిపల్లి శ్రీనివాస్, ఇబ్రహీం, బాబు తదితరులు అన్నారు. 70 ఏళ్లలో చేయని అభివృద్ధి సంక్షేమం 8 ఏళ్లలో సాధ్యం చేసి ప్రజల కళ్ళముందు ఉంచారని, ఇది సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావు అభివృద్ధి మార్క్ అని వారు చెప్పారు. సిద్దిపేట నియోజకవర్గానికి హరిశ్ రావు లాంటి గొప్ప నాయకులు ఉన్నందుకు గర్వంగా ఉందని, మేము ఎక్కడికి వెళ్లినా సిద్దిపేట అంటే ఒక ప్రత్యేక గౌరవం, గుర్తింపు ఉంటుంది అంటే అది హరిశ్ రావు లాంటి నాయకుని వలనన్నారు.. అందుకే మేము హరిశ్ రావు గారి అభివృద్ధి లో ఆయనే వెంటే ఉంటూ సిద్దిపేట ను మరింత అభివృద్ధి లో భాగస్వామ్యం అవుతాం అని తెలిపారు.