Friday, December 20, 2024

పాక్‌లో హిందూ ఆలయాలపై దాడులు

- Advertisement -
- Advertisement -

Attacks on Hindu Temples in Pakisthan

న్యూఢిల్లీ: పాక్‌లో హిందూ ఆలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. కరాచీ నగరంలోని హిందూ దేవాలయంలోని దేవతా విగ్రహాలను ధ్వంసం చేశారు. కరాచీలోని కోరంగి నెంబర్ 5 ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. బుధవారం రాత్రి శ్రీ మరిమాత ఆలయంలోని విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. ఈ సంఘటన తరువాత పోలీసులు ఆ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మోహరించారు. మోటారు సైకిళ్లపై ఎనిమిది మంది వచ్చి దాడికి పాల్పడ్డారని స్థానికుడు తెలిపారు.

Attacks on Hindu Temples in Pakisthan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News