Friday, December 20, 2024

సల్మాన్‌ ఖాన్‌కు బెదిరింపు లేఖపై దర్యాప్తు ముమ్మరం..

- Advertisement -
- Advertisement -

Investigation into threatening letter to Salman Khan

ముంబై: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, ఆయన తండ్రి సలీమ్ ఖాన్‌ను బెదిరిస్తూ వచ్చిన లేఖపై దర్యాప్తు చేపట్టిన ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల బృందం గురువారం పెణె వెళ్లి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన సిద్ధేష్ హీరామన్ కాంబ్లే అలియాస్ మహాకాల్‌ను ప్రశ్నించింది. ముంబైలోని బాంద్రా ప్రాంతంలోని ఒక బెంచిపైన ఆదివారం ఆ లేఖను ఎవరు ఉంచారన్న విషయమై కూడా కాంబ్లేను పోలీసులు ప్రశ్నించనున్నట్లు పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ఇలా ఉండగా.. పంజాబ్‌లో గత నెల జరిగిన కాంగ్రెస్ నాయకుడు, పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసు అధికారులు బుధవారం పుణె చేరుకున్నారు. ప్రస్తుతం తమ కస్టడీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గాయకుడు మూసేవాలా హత్య కేసులో ప్రధాన సూత్రధారుడని ఢిల్లీ పోలీసులు బుధవారం తెలిపారు.

Mumbai Police Investigation into threat letter to Salman Khan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News