Monday, December 23, 2024

వేటాడే సింహంలా బాలయ్య

- Advertisement -
- Advertisement -

నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని క్రేజీ కాంబినేషన్‌లో ఓ మాస్ మసాలా ఎంటర్‌టైనర్ రూపుదిద్దుకుంటోంది. ‘ఎన్‌బికె 107’ వర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. శుక్రవారం బాలకృష్ణ పుట్టిన రోజు. అయితే, బాలయ్య పుట్టినరోజుకు ఒక రోజు ముందే ఈ చిత్రం నుండి ఫస్ట్ హంట్ (టీజర్)ని విడుదల చేశారు. నిమిషం నిడివి గల ఈ ఫస్ట్ హంట్ టీజర్ హై వోల్టేజ్ యాక్షన్, మాస్ ఎలిమెంట్స్, స్టన్నింగ్ ఎలివేషన్స్, పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో అభిమానులు పండగ చేసుకునేలా వుంది. బాలకృష్ణ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్.. స్టైలిష్‌గా వుంటూనే మాస్‌ని అలరించేలా వుంది. దర్శకుడు గోపీచంద్ మలినేని తన అభిమాన హీరో బాలకృష్ణ పాత్రని మునుపటి కంటే పవర్‌ఫుల్‌గా డిజైన్ చేసినట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ హంట్‌లో బాలకృష్ణ వేటాడే సింహంలా కనిపించారు. టీజర్‌లో బాలకృష్ణ చెప్పిన డైలాగ్స్ అభిమానులకు పూనకాలు తెప్పించే విధంగా వున్నాయి. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు.

NBK 107 Movie Teaser Out

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News