Monday, December 23, 2024

ములుగు, సిరిసిల్ల జిల్లాల హెల్త్ ప్రొఫైల్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో చేపట్టిన హెల్త్ ప్రొఫైల్ పనులు పూర్తయ్యాయని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ములుగులో 1,81,540 మందికి, సిరిసిల్లలో 3,38,761 మందికి ఆరోగ్య పరీక్షలు చేసినట్లు పేర్కొన్నా రు. సిరిసిల్లలో 4,48,771 శాంపిళ్లు సేకరించి 10,60,201 టెస్ట్‌లు, ములుగులో 2,69,491 శాంపిళ్లు సేకరించి 5,08,123 టెస్ట్‌లు నిర్వహించినట్లు తెలిపారు. 70 రోజుల్లో ములుగు, హెల్త్ ప్రొఫైల్ సేకరణ చేసినట్లు చెప్పారు. ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో ప్రభు త్వం చేపట్టిన హెల్ప్ ప్రొఫైల్‌పై గురువారం మంత్రి హరీశ్‌రావు సమీ క్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఒక ఎఎన్‌ఎం, ఒక ఆశాలతో టీంను ఏర్పాటు చేసి, ఇంటి వద్దనే రక్త నమూనాలు సేకరించామని అన్నారు. ములుగు, ఎటూరూ నాగారంలో తాత్కాలికంగా ల్యాబ్ ఏర్పాటు చేసి అక్కడే శాంపిళ్లను అనాలిసిస్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇతర ప్రాంతాల్లో ఇంటి వద్దకు వెళ్లి బ్లడ్ శాంపిల్ సేకరించి, దాన్ని పీహెచ్‌సీకి తరలించి, అక్కడి నుండి టీ హబ్‌కు తీసుకువెళ్లి అనాలిసిస్ చేస్తున్నారని వివరించారు. ఎత్తు, బరువు, బీపీ, సుగర్, పల్స్ ఆక్సీ మీటర్‌తో హోమోగ్లోబిన్, కాటరాక్ట్ చెక్, ఆక్సీజన్ పల్స్ రేట్, లిపిడ్ ఫ్రోఫైల్, లివర్ ఫంక్షనింగ్, సీబీపీ,  థైరాయిడ్ వంటి వివరాలు సేకరించి ఆ వ్యక్తి హెల్త్ ఫ్రోఫైల్‌లో క్రోడీకరించనున్నట్లు చెప్పారు. హెల్త్ ఫ్రోఫైల్ తయారు చేసేటప్పడు ఒక వ్యక్తి గతంలో ఎలాంటి వ్యాధులు లేవంటే ఒక సారి మాత్రమే రక్త నమూనాలు సేకరిస్తారని, ఆ శాంపిళ్ల నుంచి హెల్త్ పారామీటర్ల సమాచారం మాత్రమే సేకరిస్తారని తెలిపారు. గతంలో వ్యాధులు ఉన్నాయని చెబితే రెండు సార్లు రక్త నమూనాలు తీసుకుని అందులో నుంచి 30 పారామీటర్లలో శాంపిల్ అనాలిసిస్ జరుగుతుందని వివరించారు. ఈ ప్రక్రియలో వ్యక్తి పేరు, ఆధార్, మ్బైల్ నెంబర్, ఫోటో వంటివి తీసుకుని భద్రపరుస్తారని, వీటితో పాటు ఆ వ్యక్తి ఆరోగ్య సమాచారం అంతా డాటా కేంద్రంలో నిక్షిప్తమవుతుందని తెలిపారు. బ్లడ్ శాంపిల్ తీసుకున్న తర్వాత హెల్త్ ఫ్రోఫైల్ డిటైల్స్ తీసుకున్నట్లు బ్లడ్ శాంపిల్ ఇచ్చిన వ్యక్తికి సమాచారం అందుతుందని అన్నారు. అలాగే బ్లడ్ అనాలిసిస్ పూర్తయిన తర్వాత మొబైల్ యాప్ నుంచి సమాచారం డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందిగా సదరు వ్యక్తి ఫోన్‌కు ఎస్ ఎం.ఎస్ ద్వారా సమచారం వస్తుందని తెలిపారు. దాంతో వారు మొబైల్ నుండి నేరుగా ఆరోగ్య సమాచారం డౌన్ లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. ఇంకా ఎవరైనా మిగిలిపోయిన వారు ఉంటే, వాళ్లను గుర్తించి, వారి నుండి బ్లడ్ శాంపిల్ సేకరించి సమచారం క్రోడీకరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
శాంపిల్స్ అనాలిసిస్ త్వరగా జరిగేలా చర్యలు
టీ డయాగ్నోసిస్‌లో బ్లడ్ శాంపిల్స్ అనాలిసిస్ త్వరగా జరిగేలా చర్యలు చేపట్టాలని మంత్రి తెలిపారు. 24 గంటల్లో వ్యక్తులకు సమాచారం అందుతుందా లేదా అన్నది ఫ్యామిలీ అండ్ హెల్త్ కమిషనర్ పరిశీలించాలని అన్నారు. మెసేజ్ పంపించే సమయాన్ని 24 గంటల కన్నా తగ్గించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. బ్లడ్ శాంపిళ్లను అనాలిసిస్ చేసిన తర్వాత ఆరోగ్యం బాగా లేని వారిని గుర్తించి వారు వైద్యులను సంప్రదించాలని వారి ఫోన్లకే మెసేజ్ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. హెల్త్ ఫ్రోఫైల్ పూర్తయిన తర్వాత ప్రతీ వ్యక్తికి కార్డు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఆ కార్డు ద్వారానే ఆరోగ్య సమాచారం, తదుపరి చికిత్సలు అందించబడతాయని చెప్పారు. ఆధార్‌లో ఫింగర్ ప్రింట్స్, పూర్తి సమాచారం ఉంటుందని, ఆ సమాచారంతో హెల్త్ ఫ్రోఫైల్ కార్డును రూపొందించేలా చర్య తీసుకోవాలని తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్ర హెల్త్ సెక్రటరీ రిజ్వీ, ఆయుష్ కమిషనర్ అలుగు వర్షిణి,ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి, డీఎంఈ రమేష్ రెడ్డి, డీహెచ్ శ్రీనివాస్ రావు, కాళోజీ యూనివర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి, టీఎస్ టీఎస్ ఎండీ వెంకటేశ్వర్లు, సిరిసిల్ల,ములుగు డీఎంఅండ్‌హెచ్‌వోలు పాల్గొన్నారు.

Health Profile completed in Mulugu and Siricilla: Harish Rao

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News