జగిత్యాల: కోరుట్లలో టిఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రులు కెటిఆర్, ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ… కోరుట్లలో రూ. వెయ్యి కోట్లతో ఆహార శుద్ధ పరిశ్రమ ప్రారంభిస్తున్నామని తెలిపారు. దీంతో యువతకు 2300 ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి పేర్కొన్నారు. కోరుట్లలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశామన్న మంత్రి కెటిఆర్ 75ఏళ్లలో రైతులకు పెట్టుబడి ఇచ్చిన ఘనత సిఎం కెసిఆర్ దేనని తేల్చిచెప్పారు. ఆర్మూర్ లో రైతులను కాల్చి చంపింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? అని మంత్రి ప్రశ్నించారు. ప్రధాని మోడీ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై చిల్లర ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మన్ కీ బాత్ లో ఒక్కసారి కూడా రాష్ట్ర ప్రగతిని మెచ్చుకొలేదని కెటిఆర్ ఆరోపించారు.
కోరుట్ల నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ @KTRTRS https://t.co/AtXuFLpHwM
— TRS Party (@trspartyonline) June 10, 2022