Friday, January 3, 2025

కోల్‌కతలో కానిస్టేబుల్ కాల్పుల కలకలం

- Advertisement -
- Advertisement -

Constable firing in Kolkata

మహిళ మృతి.. కానిస్టేబుల్ ఆత్మహత్య

కోల్‌కత: సెంట్రల్ కోల్‌కతలోని పార్క్ సర్కస్ ప్రాంతంలో ్న బంగ్లాదేశ్ డిప్యుటీ హైకమిషన్ కార్యాలయం వెలుపల శుక్రవారం మధ్యాహ్నం ఒక పోలీసు కానిస్టేబుల్ విచక్షణారహితంగా జరిపిన కాల్పులలో ఒక మహిళ మరణించగా ఆ కానిస్టేబుల్ తనను కాల్చుకుని మరణించాడు. రైఫిల్ నుంచి కానిస్టేబుల్ జరిపిన కాల్పులలో టూవీలర్‌లో వెనుక కూర్చుని వెళుతున్న ఒక మహిళ మరణించారు. ఆ మహిళ అక్కడికక్కడే మరణించగా ఆ తర్వాత కూడా కాల్పులు జరిపిన ఆ వ్యక్తి తనను తాను కాల్చుకుని మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల సంఘటన జనసమ్మర్ధంగా ఉండే ఆ ప్రాంతంలో భీతావహ వాతావరణాన్ని సృష్టించింది. కాల్పులు జరిపిన పోలీసుతోపాటు మరణించిన మహిళను కూడా ఇంకా గుర్తించవలసి ఉందని పోలీసులు తెలిపారు. ఈ మొత్తం సంఘటన ఐదు నిమిషాల పాటు ఆ ప్రాంతంలో భయానక వాతావరణాన్ని సృష్టించిందని ఒక ప్రత్యక్ష సాక్షి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News