బెంగళూరు: కూతురు జన్మదనం సందర్భంగా చికెన్ కూర వండలేదని భార్యను భర్త అతికిరాతకంగా నరికి చంపిన సంఘటన కర్నాటక రాష్ట్రం దావణగెరె జిల్లా హరిహర ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బన్నికోడు గ్రామంలో కెంచప్ప-షీలా దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె ఉంది. ఇద్దరు ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రేమంచి పెళ్లి చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయతీ పెట్టి కలిసి ఉండాలని దంపతులకు సూచించారు. భార్యపై అనుమానం ఉండడంతో ఆమెను పలుమార్లు భర్త వేధించాడు. అతడి వేధింపులు తట్టుకోలేక భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. బుధవారం రాత్రి కూతురు పుట్టిన రోజు సందర్భంగా తన భర్తకు దగ్గరకు వచ్చింది. చికెన్ కూర వండాలని భార్యకు భర్త చెప్పాడు. కానీ ఆమె వండక పోవడంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో మద్యం మత్తులో ఉన్న భర్త ఆమెను కోడవలితో నరికి చంపాడు. మత్తు దిగిపోవడంతో మర్నాడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టమ్ నిమిత్తం హరిహర ప్రభుత్వాస్పత్రికి తరలించారు.