Tuesday, December 24, 2024

రాజ్యసభ 16 సీట్లకు ఎన్నికలు…ఫలితాలు

- Advertisement -
- Advertisement -
Rajyasabha election
కర్ణాటకలో బిజెపి, రాజస్థాన్ లో కాంగ్రెస్ గెలుపు… మహారాష్ట్ర, హర్యానాలో వివాదాల కారణంగా ఫలితాల వెల్లడి ఆలస్యం.
మహారాష్ట్రలో 6 సీట్లకు , కర్ణాటక ,  రాజస్థాన్‌లలో చెరో 4 చొప్పున,  హర్యానాలో 2 సీట్ల కోసం… మొత్తంగా 16 సీట్ల కోసం జరిగిన భారీ పోరులో  – కాంగ్రెస్ , బిజెపి ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఎన్నికల కమిషన్‌ను కూడా సంప్రదించడంతో  వ్యవహారం తీవ్రంగా మారింది.

న్యూఢిల్లీ: కర్ణాటక, రాజస్థాన్‌ల నుంచి శుక్రవారం రాజ్యసభకు ఎన్నికైన ఎనిమిది మంది అభ్యర్థుల్లో… కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కాంగ్రెస్ నేత జైరాం రమేష్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా ఉన్నారు. కాగా,  మహారాష్ట్ర, హర్యానాలో పార్టీల మధ్య పరస్పరఆరోపణలతో ఓట్ల లెక్కింపు ఆలస్యమైంది.

రాజస్థాన్‌లో బిజెపి  ఎమ్మెల్యే ఒకరు పార్టీ నుంచి మారడంతో ఇబ్బందిని ఎదుర్కొన్నప్పటికీ, జెడి(ఎస్) ఎమ్మెల్యే , స్వతంత్ర శాసనసభ్యుడు క్రాస్ ఓటింగ్ చేయడం వల్ల మూడవ అభ్యర్థి గెలుపొందడంతో కర్ణాటకలో దాని జూదం ఫలించింది. కర్నాటకలోని నాలుగు స్థానాల్లో బిజెపి మూడు స్థానాలను గెలుచుకుంది.  ఇదిలావుండగా కాంగ్రెస్  రాజస్థాన్‌లో  క్రాస్ ఓటింగ్ ,  బేరసారాల భయాల మధ్య  ముగ్గురు పార్టీ అభ్యర్థులు విజయం సాధించడంతో కాంగ్రెస్ ఊపిరి పీల్చుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News