Monday, December 23, 2024

థియేటర్‌లో ఆడాలంటే అద్భుతమైన కంటెంట్‌తో సినిమా చేయాలి

- Advertisement -
- Advertisement -

“కరోనా మూలంగా మూడు సంవత్సరాల నుంచి చాలా సినిమాలు విడుదల కాకుండా ఆగిపోయాయి. ఇక మా సినిమాలను గ్యాప్ లేకుండా రిలీజ్ చేస్తాను”అని అన్నారు ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్ అధినేత బన్నీ వాసు. శనివారం ఆయన పుట్టిన రోజును జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…

వరుసగా సినిమాలు వస్తాయి…

జులై 1న పక్కా కమర్షియల్ సినిమా వస్తుంది. ఇది 100 శాతం ఎంటర్‌టైనర్. గోపీచంద్ యాక్షన్ హీరో అయినా కూడా.. మారుతి ఈ సినిమాను ప్రేక్షకులను నవ్వించడానికి తెరకెక్కించాడు. సెప్టెంబర్ 10న నిఖిల్ హీరోగా ‘18 పేజేస్’ విడుదల చేస్తాము. దసరా సీజన్‌లో సెప్టెంబర్ 30న కిరణ్ అబ్బవరంతో చేస్తున్న ‘వినరో భాగ్యము విష్ణు కథ’ విడుదల చేస్తాను. అలాగే అల్లు శిరీష్ సినిమా కూడా విడుదల చేస్తాను. వరుసగా ఈ మూడు, నాలుగు నెలలు గీతా ఆర్ట్ 2 నుంచి సినిమాలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు చేసే సినిమాలు అన్నీ అయిపోయాక.. చందు మొండేటి, పవన్ సాధినేని సినిమాలు ఉండబోతున్నాయి.

ఆ టైమ్ గ్యాప్ పెంచాలని చూస్తున్నా…

ఓటిటి గురించి కూడా నేను చాలా క్లారిటీగా ఉన్నాను. నా సినిమాలేవీ కనీసం 35 రోజులు వ్యవధి లేకుండా ఓటిటికి ఇవ్వలేదు. రాబో యే రోజుల్లో ఆ టైమ్ గ్యాప్ ఇంక పెంచాలని చూస్తున్నాను. మా బ్యానర్ నుంచి వచ్చేవన్నీ ఎంటర్‌టైనింగ్ సినిమాలు. వాటిని థియేటర్లో చూసినప్పుడే మజా వస్తుంది. థియేటర్లో బాగా నవ్వించిన సినిమాలు కూడా ఓటిటిలో ఫ్లాప్ అవుతుంటాయి. ఎందుకంటే కేవలం థియేటర్లోనే చూసే సినిమాలు కొన్ని ఉంటాయి.

అందరికీ అందుబాటులో టికెట్ రేట్స్…

సినిమా టికెట్ల విషయానికి వస్తే తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌ను బట్టి టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించింది. నేను ఎంత సంపా-దించాను అని కాకుండా.. ఆడియన్స్‌ను థియేటర్‌కి ఎంత దగ్గరగా ఉంచామనేది ముఖ్యం. అందుకే పక్కా కమర్షియల్ సినిమాకు కూడా అందరికీ అందుబాటులో ఉండే టికెట్ రేట్స్ పెట్టాం.

సాధారణ కంటెంట్‌తో సినిమా చేయలేము…

2002లో డిస్ట్రిబ్యూటర్‌గా నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. నిర్మాతగా 2011లో నా మొదటి సినిమా ‘100% లవ్’ చేశాను. దాదాపుగా ఈ పదేళ్లలో చాలా మార్పులు వచ్చాయి. రాముడు బుద్ధిమంతుడు అని చెప్తే ఇప్పుడు వినేవారు లేరు.. రాముడు బెత్తం పడతాడు అని చెబితే వినే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. థియేటర్‌లో ఆడటం కోసం అద్భుతమైన కంటెంట్‌తో సినిమా చేయాలి. సాధారణ కంటెంట్‌తో సినిమా చేయలేము.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News