Friday, November 22, 2024

రుతుపవనాలు ముందుకు

- Advertisement -
- Advertisement -

రాగల 48 గంటల్లో తెలంగాణ, ఎపిలోని కొన్ని ప్రాంతాల్లో నేడు, రేపు వర్షాలు

మన నైరుతి రుతుపవనాలు శనివారం మధ్య అరేబియా సముద్రంలోని మిగిలిన భాగాలు, ముంబైతో సహా, కొంకణ్‌లోని చాలా ప్రాంతాల్లోని మధ్య మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాగల 48 గంటల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ మధ్య అండ్ వాయువ్య బంగాళాఖాతంలో రుతుపవనాలు మరింత ముం దుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావర ణ శాఖ పేర్కొంది. రాగల రెండు, మూడు రోజుల్లో తెలంగాణాలోని మరికొన్ని భాగాలు, ఆంధ్రప్రదేశ్, బంగాళా ఖాతంలోని చాలా ప్రాంతాలు, ఒడిశాలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా మారతాయని అధికారులు వివరించారు. శనివారం క్రింది స్థాయి గాలులు ముఖ్యంగా పశ్చిమ దిశ నుంచి తెలంగాణ వైపు వీస్తున్నాయని ఈ నేపథ్యంలో నేడు, రేపు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వర్షాలు కురిసిన సమయంలో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతోపాటు నేడు రాష్ట్రంలోని నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Rains likely to hit Telangana for next 48 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News