రేపటి నుంచి స్కూళ్లు తెరిస్తే చిన్నారులకు సోకే ప్రమాదం
పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టిన ప్రారంభించాలంటున్న టీచర్లు
రెండు రోజుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని విద్యాధికారులు వెల్లడి
హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతుండటంతో సోమవారం నుంచి స్కూళ్లు ప్రారంభమైతుండటంతో వైరస్ ప్రభావం చిన్నారులపై పడుతుందని వైద్యశాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ఆరోగ్య సంస్ద ఈనెల చివరి వారం నుంచి మహమ్మారి విశ్వరూపం దాల్చే ప్రమాదముందని హెచ్చరించడంతో బడులు తెరిచే విషయంపై అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. ఒకవేళ పాఠశాలల తెరిస్తే పిల్లలకు సోకితే వేగంగా వైరస్ విస్తరిస్తుందని పేర్కొంటున్నారు. పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టిన తరువాత పాఠశాలలు పునః ప్రారంభిస్తే ఇబ్బందులు ఉండవని వారం రోజుల పాటు పరిస్దితులు చూసి స్కూళ్ల ప్రారంభంపై నిర్ణయం తీసుకోవచ్చని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈనెలల్లో పాజిటివ్ కేసులు వివరాలు చూస్తే నెల 7వ తేదీన 79 కేసులు, ఈనెల 8న 83 మందికి సోకగా, ఈనెల 9వ తేదీన 94 మందికి, ఈనెల 10వ తేదీన 81 కేసులు నమోదైనట్లు వైద్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నారు.
రానున్న రోజుల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరగవచ్చని దానిని దృష్టిలో పెట్టుకుని బడులను విషయంలో ఆలస్యం కావచ్చని చెబుతున్నారు. జిల్లాలో 689 ప్రభుత్వ పాఠశాలలు, 1745 ప్రైవేటు పాఠశాలలుండగా ఈనెల 13వ తేదీ నుంచి స్కూళ్ల ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో గత వారం రోజుల నుంచి స్కూళ్లను శానిటైజర్ చేయడంతో పాటు విద్యార్థులకు సరిపడ సౌకర్యాలు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందిని కార్పొరేటర్ యాజమాన్యాలు సిద్దం చేశాయి.వీటికి తోడు పుస్తకాలు, దుస్తులు కూడా సిద్దంగా ఉంచి, విద్యార్థులకు అధిక ధరలకు విక్రయాలు చేసి భారీగా లాబాలు మూటగట్టుకుందామని లెక్కలు వేస్తున్న సంస్దలకు కరోనా దెబ్బతీస్తుందని మథనపడుతున్నారు. నెల రోజుల పాటు స్కూళ్లు నడిస్తే మొదటి విడుత ట్యూషన్ పీజులు, రవాణా చార్జీలు తీసుకునే అవకాశ ఉండేదని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం స్కూళ్ల ప్రారంభం వాయిదా వేయకుండా ఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తుంది. అదే విధంగా సర్కార్ బడులు కూడా ఈవిద్యాసంవత్సరంలో నాణ్యమైన విద్య అందించేందకు ఇంగ్లీషు మీడియంతో పాటు, మనబస్తీ, మనబడి కార్యక్రమం కింద స్కూళ్లకు మరమ్మతులు చేస్తూ విద్యార్ధుల సంఖ్య పెంచుకునేందుకు పది రోజలు నుంచి బడిబాట నిర్వహిస్తూ నగర ప్రజలకు అవగాహన చేస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్ల ఉపాధ్యాయులు వైరస్ తగ్గుముఖం పట్టిన తరువాత ప్రారంభిస్తే చిన్నారులు ఆరోగ్యంగా ఉంటారని పేర్కొంటున్నారు.