Friday, November 22, 2024

మ్యాన్‌హోల్ ప్రమాదాలు జరగకుండా జలమండలి ప్రత్యేక చర్యలు

- Advertisement -
- Advertisement -

jalamandali special measures to prevent manhole accidents

మూతలేనివాటిని, ధ్వంసమైన వాటిని గుర్తించి అధికారులు
డివిజన్ కార్యాలయాలో సరిపడ సేప్టీ కిట్లు అందుబాటులో
పాత మ్యాన్‌హోల్ స్థానంలో కొత్తవి అమర్చుతున్నట్లు వెల్లడి

హైదరాబాద్: గ్రేటర్ నగర ప్రజలకు తాగునీటి జలాలు అందిస్తున్న జలమండలి వానకాలం ప్రారంభం కావడంతో ప్రజలు ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా ప్రత్యేక చర్యలు చేపడుతుంది. గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని వరద ఉదృత్తిలో మ్యాన్‌హోల్ పడకుండా వాటిని పకడ్బందీగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవలే బోర్డు ఉన్నతాధికారులు ప్రజల భద్రత కోసం పటిష్ట చర్యలు తీసుకోవడానికి, అవగాహన కల్పించడానికి మాన్‌సూన్ సేప్టీ వాక్ ప్రత్యేక కార్యక్రమ అన్ని డివిజన్‌లో నిర్వహించారు. వానాకాలం నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వ సూచనల మేరకు సేప్టీ ఆడిట్ ప్రారంబించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ప్రతి ఓ అండ్ ఎం సెక్షన్‌లో మేనేజర్ నేతృత్వంలో ఒక బృందంగా ఏర్పడి ఆ సెక్షన్ పరిధిలో మొత్తం పర్యటిస్తూ ఎక్కడైనా మ్యాన్‌హోల్ మూతలేని వాటిని, ధ్వంసమైన వాటిని గుర్తించి వెంటనే కొత్త వాటిని అమర్చుతున్నారు. ఎక్కడైనా లోతైనా మ్యాన్‌హోల్‌కు సేప్టీ గ్రిల్ లేకపోతే వెంటనే ఏర్పాటు చేస్తూ, పనులు జరుగుతున్నప్పడు కచ్చితంగా బారీకేడ్లు, హెచ్చరికల బోర్డులు పెడుతున్నారు.

వరద నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి సూచిక బోర్డులను, ఎర్ర జెండాలని ఏర్పాటు, పనులు చేపట్టిన ప్రదేశాల్లో శిథిలాలను, మ్యాన్‌హోళ్ల నుంచి తీసిన పూడిక పనులు వేగంగా స్దానిక డివిజన్ మేనేజర్లు చెబుతున్నారు. సెక్షన్ కార్యాలయాల్లో సేప్టీ కిట్లు సరిపడ అందుబాటులో ఉంచినట్లు పైపులైన్ విస్తరణ పనులు చేపట్టిన ప్రాంతాల్లో రోడ్డు పునరుద్దరణ పనులు చేస్తున్నట్లు చెప్పారు. నాలుగైదు రోజుల కితం దాదాపు అన్ని సెక్షన్‌లో సమగ్రంగా సేప్టీ ఆడిట్ పూర్తి చేసి నివేదిక ఉన్నతాధికారులు అందజేసినట్లు తెలిపారు. ఓఆర్‌ఆర్ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో మరింత జాగ్రత్తగా వ్యవహారిస్తూ రిజర్వాయర్ల నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. ఈ వానకాలంలో ప్రమాదాలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News