- Advertisement -
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలకు మరో 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ముంబైతో పాటు ఉత్తర మహారాష్ట్ర, కర్నాటకలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించనున్నాయని తెలిపింది. 48 గంటల్లో కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ కి విస్తరించే అవకాశముందని వాతవరణ అధికారులు వెల్లడించారు. వచ్చే 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే చాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ ప్రాంతాల నుంచి తెలంగాణలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. రాష్ట్రంలో ఇవవాళ, రేపు అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాముంది.
- Advertisement -