Saturday, December 21, 2024

ప్రత్యూష గరిమెల్ల ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు

- Advertisement -
- Advertisement -

Pratyusha Garimella

హైదరాబాద్: ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ గరిమెల్ల ప్రత్యూష ఆత్మహత్య కేసులో బంజారాహిల్స్‌ పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.  పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒంటరితనం, డిప్రెషన్‌ కారణంగానే ప్రత్యూష ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అత్యంత విషపూరితమైన కార్బన్‌ మోనాక్సైడ్‌ పీల్చి ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. కార్బన్‌ మోనాక్సైడ్‌ బాటిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నివేదిక వస్తే ఆత్మహత్యపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉందన్నారు.

ఓ ప్రముఖ హీరోయిన్‌తో ప్రత్యూష చివరిసారిగా మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. చార్‌కోల్‌ గ్రిల్‌లో కార్బన్‌ మోనాక్సైడ్‌ రసాయనాన్ని ఉంచి,  మంటను రగిలించడం ద్వారా వచ్చే పొగను పీల్చి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బిల్డింగ్‌ సెల్లార్‌లోని బెడ్‌రూమ్‌లో రెండు గ్రిల్స్‌లో కార్బన్‌ మోనాక్సైడ్‌ను మండించి,  సోఫాలో పడుకొని ప్రాణాలు వదిలినట్లు పేర్కొన్నారు.

ప్రత్యూష నుంచి సుసైడ్‌ లెటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘నేను కోరుకున్న జీవితం ఇది కాదు అందుకే వెళ్ళిపోతున్నాను’ అంటూ లేఖలో పేర్కొంది. గత కొంత కాలంగా ప్రత్యూ తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు తెలుస్తోంది. డిప్రెషన్ నుంచి బయటకు రాలేక తీవ్ర మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రత్యూష నుంచి సుసైడ్‌ నోటట్‌, పెన్‌బ్రైవ్‌, సీసీటీవీ ఫుటేజ్‌, మొబైల్‌ను పోలీసులు సీజ్‌ చేశారు. ఎఫ్‌ఎస్‌ఎల్‌కు శాంపిల్స్‌ను వైద్యులు పంపారు. అపోలో ఆస్పత్రికి ప్రత్యూష మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైంది. ఆమె అంత్యక్రియలు రేపు జరగనున్నాయి.

దేశంలో 30 మంది ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్‌లలో ఆమె ఒకరు. దాదాపు టాలీవుడ్‌, బాలీవుడ్‌ సినీ తారలకు ఫ్యాషన్‌ డిజైనర్‌గా  పనిచేశారామె.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News