- Advertisement -
అమరావతి: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. మచిలీపట్నంలో పజ్జీ గేమ్ కు యువకుడు బలయ్యాడు. పజ్జీ గేమ్ లో ఓడిపోయానని మనస్తాపంతో యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాధితుడిని ప్రభు(16)గా గుర్తించారు. కుటుంబ సభ్యుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
- Advertisement -