- Advertisement -
మల్కనగిరి(ఒడిశా): దాదాపు 300 మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు మల్కనగిరి జిల్లా స్వాభిమాన్ అంచల్ లోని ఒడిశా పోలీస్‌ల ముందు లొంగిపోయారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎస్‌కె బన్సాల్ ఆదివారం ఈ విషయం వెల్లడించారు. వీరంతా ఎలాంటి ఆయుధాలు ఉపయోగించని గ్రామస్థులు. మావోయిస్టుల సానుభూతిపరులుగా, ఇన్‌ఫార్మర్లుగా, సహాయకులుగా పనిచేస్తుంటారు. జంత్రీగ్రామ పంచాయతీలోని ఢకడ్‌పడార్, డాబుగూడ, టాబెర్, అర్లింగపాడ గ్రామాలకు చెందిన వీరంతా గణనాట్య సంఘ, గ్రామ కమిటీల్లో సభ్యులుగా ఉంటున్నారు. స్వచ్ఛందంగా వీరు జంత్రిలోని బిఎస్‌ఎఫ్ శిబిరానికి తరలి వచ్చి పోలీస్‌ల ఎదుట లొంగిపోయారని డిజిపి చెప్పారు.
300 Maoist Militia members Surrender in Odisha
- Advertisement -