కటక్: భారత్‌తో ఆదివారం జరిగిన రెండో టి20లో సౌతాఫ్రికా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో దక్షిణాఫ్రికా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 20 ఆధిక్యాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ మరోసారి దూకుడుగా ఆడాడు. ధాటిగా ఆడిన ఇషాన్ రెండు సిక్సర్లు, 3 సిక్సర్లతో 34 పరుగులు చేశాడు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ రెండు సిక్స్‌లు, మరో 2 బౌండరీలతో 40 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చివర్లో దినేశ్ కార్తీక్ 30 (నాటౌట్) రాణించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా 18.2 ఓవర్లలోనే ఆరు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఒక దశంలో 23 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికాను కెప్టెన్ బవుమా(35), వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ ఆదుకున్నారు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన క్లాసెన్ 46 బంతుల్లోనే ఐదు సిక్సర్లు, ఏడు ఫోర్లతో 81 పరుగులు చేశాడు. డేవిడ్ మిల్లర్ 20 (నాటౌట్) తనవంతు పాత్ర పోషించాడు.
South Africa Won by 4 wickets against India